ETV Bharat / state

'సాంప్రదాయ బోధనా పద్ధతిని.. ఆన్‌లైన్ తరగతులు భర్తీ చేయలేవు' - గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తాజా వార్తలు

విద్యార్థులకు పరీక్షల నిర్వహణలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్.. విశ్వవిద్యాలయాల ఉప కులపతులను కోరారు. విద్యావ్యవస్థను సమగ్రంగా నిలబెట్టడంలో.. ప్రభుత్వం రాజీపడదని మంత్రి అదిమూలపు సురేష్ అన్నారు.

ap governor
ap governor
author img

By

Published : Jul 17, 2020, 10:15 PM IST

పరీక్షల నిర్వహణలో కొవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కోరారు. విజయవాడ రాజ్ భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, నిర్వాహకులతో గవర్నర్ మాట్లాడారు. చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణలో కొవిడ్ -19 ప్రోటోకాల్స్ కట్టుబడి ఉండాలని అన్నారు.

యూజీసీ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు కొవిడ్-19 మహమ్మారి సృష్టించిన పరిస్థితి కారణంగా.. ఉన్నత విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులను వర్చువల్ మోడ్‌లో నిర్వహించడానికి నిర్ణయించాయని రాష్ట్ర గవర్నర్ అన్నారు. సాంప్రదాయ తరగతిగది, బోధనా పద్దతిని ఆన్‌లైన్ తరగతులు భర్తీ చేయలేవని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి విద్యాసంస్థలు తగిన ఇ-కంటెంట్‌ను అభివృద్ధి చేసి ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా తరగతులు నిర్వహించడానికి పాఠ్యాంశాలను పునర్నిర్మించి రూపకల్పన చేయాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్న 20 రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ సంభాషించేటప్పుడు.. మునుపటి విద్యాసంవత్సరం సిలబస్‌ను ఆన్‌లైన్ మోడ్ ద్వారా పూర్తి చేయడంలో విశ్వవిద్యాలయాలు అవలంబించిన వినూత్న పద్దతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం, ఆఫ్-లైన్ లేదా ఆన్‌లైన్ మోడ్‌లో, కొవిడ్-19 ను అనుసరించి, అండర్ గ్రాడ్యుయేట్.. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

కొవిడ్-19 మహమ్మారి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు ఉన్నత విద్యాసంస్థలు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రీ-డిజైన్, రీ-ఫార్మాట్, రీ-ఓరియంట్ పాఠ్యాంశాలను రూపొందించడం అవసరమని విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా సృష్టించిన పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ, విద్యావ్యవస్థను సమగ్రంగా నిలబెట్టడంలో.. పరీక్షల నిర్వహణలో సమగ్రతను కాపాడుకోవడంలో.. ప్రభుత్వం రాజీపడదని మంత్రి అన్నారు. సమావేశంలో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్ర రెడ్డి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, కాలేజియేట్ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్ నాయక్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సరైన సమయంలో చికిత్స అంది ఉంటే...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.