ETV Bharat / state

పది పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం!

author img

By

Published : Jun 20, 2020, 3:56 AM IST

రాష్ట్రంలో పది పరీక్షలు నిర్వహిస్తారా?... లేదా? అన్న ప్రశ్నలకు నేడో, రేపో స్పష్టమైన సమాధానం రానుంది. దీనిపై అధికారులు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

tenth exams in ap
tenth exams in ap

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు నేడో, రేపో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షలపై ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై గురు, శుక్ర వారాల్లో నిర్వహించిన సమావేశాల్లో వారు చర్చించారు.

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పది పరీక్షలు రద్దు చేశాయి. అంతర్గత పరీక్షల్లో విద్యార్థి ప్రతిభ, సామర్థ్యాల ఆధారంగా ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించాయి. ఏపీలోనూ ప్రతిపక్షాలు ఇదే డిమాండ్​ చేస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులు 6,30,804 మంది ఉన్నారు.

ఇదీ చదవండి

ఆడపిల్ల పుట్టిందని... బావిలో విసిరేశారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.