ETV Bharat / state

చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

author img

By

Published : Jun 17, 2020, 4:09 PM IST

వైఎస్​ఆర్ నేతన్న నేస్తం పథకం రెండో విడత కార్యక్రమం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20న లబ్ధిదారుల ఖాతాల్లోకి 24వేల రూపాయల చొప్పున జమ చేయనుంది.

ysr nethanna nestham
ysr nethanna nestham

చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' పథకం రెండో విడత కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన అమలు చేయనుంది. దీనిని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం రెండో విడత అమలుకు సంబంధించి వస్త్ర, చేనేత శాఖ డైరెక్టర్​కు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2020- 21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ పథకం అమలుకు పరిశ్రమల శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. 81,783 మంది చేనేత కుటుంబాలకు 24 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆర్థిక సాయం అందని లబ్ధిదారులకు ఈఏడాది చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరమగ్గాలను ఆధునీకరించుకునే లక్ష్యంతో చేనేతలకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందించనుంది.

ఇదీ చదవండి

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై 'నిర్భయ' కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.