ETV Bharat / state

ఒకే వేదికపైకి అన్ని సంఘాలు.. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం - ఉద్యోగ సంఘాలు - ఒకే వేదికపైకి ఏపీ ఉద్యోగ సంఘాలు

ఒకే వేదికపైకి ఏపీ ఉద్యోగ సంఘాలు
ఒకే వేదికపైకి ఏపీ ఉద్యోగ సంఘాలు
author img

By

Published : Jan 20, 2022, 7:11 PM IST

Updated : Jan 20, 2022, 7:44 PM IST

19:06 January 20

రేపటి సమావేశంలో విధివిధానాల నిర్ణయం - ఉద్యోగ సంఘాలు

AP employees JAC leaders : పీఆర్సీపై పోరాటం చేసేందుకు అన్ని సంఘాలు ఒకే వేదికపైకి రావాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం కావాలని.. అన్ని జేఏసీలు ఒకేతాటిపైకి రావాలని అభిప్రాయపడ్డాయి. రేపటి సమావేశంలో విధివిధానాలను నిర్ణయిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. ఉమ్మడి కార్యాచరణపై రేపు సచివాలయంలో మరోమారు భేటీ అవుతామన్న నేతలు.. ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై చర్చిస్తామని వెల్లడించారు.

సమ్మె నోటీసుకు కట్టుబడి ఉన్నాం - బండి శ్రీనివాసరావు

"సమ్మె నోటీసు విషయమై మేము కట్టుబడి ఉన్నాం. సమ్మె నోటీసు విషయమై ఉద్యోగ సంఘాల భేటీలో చర్చిస్తాం. సమ్మె విషయంలో మాతో పాటు కలిసి రావడంపై చర్చిస్తాం. ఉద్యోగ సంఘాలతో చర్చించాక ఉమ్మడి కార్యాచరణ" - బండి శ్రీనివాసరావు, ఏపీఎన్జీవో సంఘ అధ్యక్షుడు

ఒకే వేదికపైకి వచ్చాం - బొప్పరాజు

రేపు ఉదయం 11.30 గం.కు ఉద్యోగ సంఘాలు భేటీ అవుతాయని అమరావతి జేఏసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెల్లడించారు. ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై చర్చిస్తామని చెప్పారు. 11వ పీఆర్సీ సాధన విషయమై భేటీలో చర్చిస్తామన్న ఆయన.. నాలుగు ఉద్యోగ సంఘాల నాయకులం ఒకే వేదికపైకి వచ్చామని స్పష్టం చేశారు. ఉమ్మడి కార్యాచరణ కోసం ఏకాభిప్రాయానికి వస్తామని వివరించారు.

డిమాండ్లపై చర్చిస్తాం - సూర్యనారాయణ

"అన్ని జేఏసీలు ఒకేతాటిపైకి రావాలని నిర్ణయం. రేపు సచివాలయంలో ఉద్యోగ సంఘాల భేటీ ఉంటుంది. రేపటి సమావేశంలో విధివిధానాల నిర్ణయం. ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై చర్చిస్తాం" - సూర్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఆందోళనలు సరికాదు - మంత్రులు

Ministers on employees protest : మరోవైపు ఉద్యోగుల ఆందోళనలపై మంత్రి సురేశ్, బొత్స స్పందించారు. మంత్రి సురేశ్ మాట్లాడుతూ.. సీఎం జగన్​తో సమావేశంలో ఉద్యోగులు పీఆర్సీని అంగీకరించి.. మళ్లీ ఇప్పుడు ఆందోళనలు చేయటం సరికాదన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే జీవోలు విడుదల చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల సమ్మెకు వెళ్ళటం సరికాదన్నారు. మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు తాము చర్చించడానికి సిద్ధంగానే ఉన్నామన్నారు. ఉద్యోగస్థులు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత చర్చించి కేబినెట్​లో ఒక నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు. జీవోలు ఇచ్చి తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారని, వాటన్నిటినీ పరిశీలించి.. ఆలోచిస్తామన్నారు. ఉద్యోగులు నోటీసులు ఇచ్చి దాని మీద చర్చించడం వారి హక్కు... కానీ సమ్మెకు వెళ్లడం సరైన విధానం కాదని బొత్స అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి

అప్పుడు పీఆర్సీకి అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు చేయటం సరికాదు: మంత్రి సురేశ్‌

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 20, 2022, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.