రాష్ట్రానికి మరో 4.68 లక్షల కొవిడ్ టీకా డోసులు తరలివచ్చాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. దిల్లీ నుంచి చేరుకున్న కార్గో విమానంలో టీకా డోసులు రాష్ట్రానికి తరలివచ్చాయి.
తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్లను అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్ తరలివెళ్లనున్నాయి. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం కలిగింది.
ఇదీ చదవండి: AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 2,068 కరోనా కేసులు, 22 మరణాలు