ETV Bharat / state

తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్‌కు అదనపు బాధ్యతలు - Telangana DGP Appointment News

Telangana DGP : తెలంగాణలో డీజీపీగా అంజనీకుమార్​ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. డీజీపీగా విధులు నిర్వర్తించిన మహేందర్​ రెడ్డి పదవీ విరమణ చేయనుండటంతో.. అంజనీకుమార్​కు అదనపు బాధ్యతలు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది.

Telangana DGP
డీజీపీగా అంజనీకుమార్‌
author img

By

Published : Dec 29, 2022, 5:53 PM IST

Telangana DGP Responsibilities : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అంజనీకుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ఇన్​ఛార్జి డీజీపీగా అంజనీకుమార్​ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నెలాఖరున ప్రస్తుతం డీజీపీగా ఉన్న మహేందర్​ రెడ్డి పదవీవిరమణ చేయనున్నారు. అలాగే రాష్ట్రంలోని ఆరుగురు ఐపీఎస్​లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ను సీఐడీ డీజీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

రాచకొండ కమిషనర్​గా డీఎస్​ చౌహాన్​ను నియమించింది. అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్న రవిగుప్తాకు.. విజిలెన్స్​ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్​ను, శాంతిభద్రతల అదనపు డీజీగా సంజయ్​ కుమార్​ జైన్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.