మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టైల్ మెడిసిన్ వంటి వాటి గురించి పేర్కొనడం, ప్రాచుర్యం కల్పించడం సరైన పద్ధతి కాదని అధికారులు పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి రూపొందించిన ప్రమాణాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ చికిత్సలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయని తెలిపారు. బాధితులకు చికిత్స అందించే క్రమంలో గమనించిన కొత్త అంశాలను సదస్సులు, మెడికల్ జర్నల్స్ ద్వారా వెలుగులోకి తీసుకువస్తే వాటిని వెల్లడించే అవకాశం ఉందని డా.సాంబశివరెడ్డి స్పష్టం చేశారు.
కరోనా చికిత్స మందులు, వైద్య విధానం గురించి వైద్యులు ప్రచారం చేయడం తగదని ఏపీ వైద్య మండలి అభిప్రాయపడింది. ఇలా చేయడం ద్వారా ప్రజల్లో ఆందోళన నెలకొంటుందని వెల్లడించింది. బాధితులకు చికిత్స అందించే క్రమంలో గమనించే కొత్త విషయాలను అధికారికంగా నిర్ణయించి... మెడికల్ జర్నల్స్ ద్వారా సమాచారం అందిస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:
AOB ALERT: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో భారీగా పోలీసుల మోహరింపు