Anganwadis 23rd Day Strike in Andhra Pradesh: అంగన్వాడీలు కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని అణచివేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అంగన్వాడీలు, సహాయకులను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ధర్నాకు వెళ్లకుండా అంగన్వాడీలను గృహనిర్బంధాలు చేసి ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఆందోళనలకు బయలుదేరిన కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. అంగన్వాడీలు మారువేషాల్లో వెళ్తారనే అనుమానంతో పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. కలెక్టరేట్ల ఎదుట భారీగా బలగాలు మోహరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 23వ రోజు ఉద్ధృతంగా కొనసాగింది.
అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. కనీస వేతనం చెల్లించాలని కోరుతూ పార్వతీపురం కలెక్టరేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన చేస్తున్న అంగన్వాడీలకు నోటీసులు అందించటానికి వచ్చిన సీడీపీవో ప్రసన్నకుమారిని కార్యకర్తలు నిర్బంధిచారు.
Anganwadi Protest in Srikakulam: కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ నాయకులతో కలిసి అంగన్వాడీలు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవటంతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాడేరు కలెక్టరేట్ అంగన్వాడీల నినాదాలతో మారుమోగింది. ఐసీడీఎస్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు సమ్మె విరమించబోమని ఆంగన్వాడీలు తేల్చి చెప్పారు.
అంగన్వాడీల అరెస్టు జగన్ నియంతృత్వానికి నిదర్శనం: లోకేశ్
Anganwadis Strike in District Collectorates: అంగన్వాడీల సమస్యలు తనకు తెలుసని తాను అంగన్వాడీగా పని చేశానని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మిరియాల శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 26 వేల వేతనాన్ని చెల్లించాలని కోరారు. అంగన్వాడి సమస్యలను సీఎం జగన్ పట్టించుకోకపోగా ఈనెల 5 నుంచి విధుల్లో చేరకుంటే తొలగిస్తామని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించుకుంటే ఐటీడీఏ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని తెలిపారు.
జగనన్న'ఏసీలో నువ్వు ఉన్నావు' 'రోడ్డు మీద మేము ఉన్నాం': అంగన్వాడీలు
Anganwadi in Nandyal Collectorate : అంగన్వాడీల ధర్నాలతో నంద్యాల దద్దరిల్లింది. నంద్యాల కలెక్టరేట్ కార్యాలయ సమీపాన ప్రధాన రహదారిపై వేలాదిగా అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించారు. డిమాండ్లను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అంగన్వాడీల ఆందోళనతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
సీఎం జగన్ దయవల్లే నూతన సంవత్సర తొలిరోజు రోడ్డుపై ఉన్నాం: అంగన్వాడీ సంఘాల నేతలు
Anganwadis Strike in Satya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ గణేశ్ సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. సుప్రీం తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు.
సమ్మెను ఉద్ధృతం చేస్తున్న అంగన్వాడీలు - అడ్డుకుంటున్న పోలీసులు
Police Arrest Anganwadi in Vijayawada: అంగన్వాడీల కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విజయవాడలో ధర్నాకు బయలుదేరిన కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలకు చెందిన కార్యకర్తలను తెల్లవారుజామునే గృహనిర్బంధాలు చేసి చిల్లకల్లులోని కళ్యాణ మండపానికి తరలించారు. అక్కడ ఓ మహిళ స్పృహ తప్పి పడిపోగా హుటాహుటిన జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమంటే అరెస్టులేంటని అంగన్వాడీలు నిలదీశారు. జగన్ మాట తప్పి మడమ తిప్పారని మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడమని, హామీలు నెరవేర్చే వరకు పోరాడతామన్నారు.
Anantapuram Collectorate: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి కలెక్టరేట్ ముట్టడికి బస్సుల్లో వెళ్తున్న అంగన్వాడీలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం లేదని అంగన్వాడీలు మండిపడుతున్నారు.
వైఎస్సార్ కిట్ల పంపిణీకి అంగన్వాడీలు రాకపోతే ప్రత్యామ్నాయం చూస్తాం: బొత్స
Machilipatnam Collectorate: గత 23 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో కదం తొక్కారు. కలెక్టరేట్ ముట్టడికి జిల్లా నలుమూలల నుండి వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు తరలి వచ్చారు. కలెక్టరేట్ మార్గంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం తోసుకువెళ్లి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్లో ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసిన అంగన్వాడీ కార్యకర్తలు ,ఆయాలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శించారు. వారితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే నిరసన వ్యక్తం చేశారు .అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులు ప్రశ్నించారు. అనంతరం ఇదేమి రాజ్యాంగం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దింపుతాం: అంగన్వాడీలు
Guntur Collectorate: గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట మూడు గంటలకు పైగా అంగన్వాడీలో ఎండలోనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాజీ బి అనే అంగన్వాడీ ఆందోళన చేస్తున్న సమయంలో స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆందోళనకారుల వద్దకు వచ్చి జిల్లా కలెక్టర్ రాజకుమారి వచ్చి వినతి పత్రాన్ని స్వీకరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జేసీ తెలిపారు. అంగన్వాడీల సేవలు ఎంతో విలువైనవని, త్వరితగతిన విధుల్లోకి రావాలని కోరారు.
Kadapa Collectorate: అంగన్వాడి కార్యకర్తలు కడప కలెక్టరేట్ ముట్టడించారు. అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి కడప కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు కూడా భారీగా చేరుకొని ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లోపలికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ బయట ధర్నాకు దిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. వీరు చేస్తున్న ఆందోళనకు అన్ని ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈనెల 5వ తేదీ లోపల అంగన్వాడీ కార్యకర్తలు విధులకు హాజరు కాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించినా తాము వెనక్కి తగ్గేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు.
సీఎం జగన్‌కు కనపడదా, వినపడదా - పన్నెండో రోజూ కదం తొక్కిన అంగన్వాడీలు