రాష్ట్రంలోని 6 జిల్లాల్లో అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటైందని ఐకాస సభ్యులు స్వామి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కృష్ణాజిల్లాకు ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. అమరావతి సాధనే లక్ష్యంగా అమరావతి పరిరక్షణ సమితి కృషి చేస్తోందన్నారు. అమరావతిలో రాజధాని కావాలని రైతులు అడగలేదన్న ఆయన... ఇప్పుడు ఇతర ప్రాంతాలకు తరలిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు అమరావతికి ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఏమైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలి గాని, ఆ నెపంతో రైతులను రోడ్డున పడేయకూడదని స్వామి అన్నారు.
అమరావతి ఉద్యమం యాక్షన్ ప్లాన్ను తయారు చేస్తున్నట్లు జేఏసీ కన్వీనర్ తిరుపతిరావు తెలిపారు. ఈ నెల 3వ తేదీన అంబేడ్కర్, గాంధీజీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వనున్నామని, 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపడతామని స్వామి తెలిపారు. 5వ తేదీన ఐకాస ఏర్పాటైన జిల్లాలో మానవహారాలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 6వ తేదీన ఎంఆర్ఓ, ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇచ్చి తమ నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :