ETV Bharat / state

'జీవో నెం.22ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి' - నగదు బదిలీ పథకం న్యూస్

ఉచిత విద్యుత్ పథకం స్థానంలో నగదు బదిలీ పథకాన్ని తీసుకురావాలనే ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జీవో నెం.22ను ఉపసంహరించుకోవాలని ఆలిండియా కిసాన్ సంఘర్ష కో-ఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేసింది.

all india kisan sanghrsha coordination committee meeting
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
author img

By

Published : Sep 15, 2020, 4:07 PM IST

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.22ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా కిసాన్ సంఘర్ష కో-ఆర్డినేషన్ కమిటీ విజయవాడలో సమావేశమయ్యింది. ఉచిత విద్యుత్ పథకానికి బదులుగా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతూ జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన రైతు సంఘాల నాయకులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్​ బిల్లుతో పాటు ఇతర బిల్లులతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకించాయనీ.. కానీ కేంద్రం ఈ బిల్లును చట్టం చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్​కి తూట్లు పొడిచే నిర్ణయాన్ని తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై భారం పడే జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ఆశ చూపి డబ్బు వసూలు చేశారు...అడిగితే ముఖం చాటేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.