కృష్ణా జిల్లా నందిగామలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. తమ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటం చేయాలని తీర్మానించారు. అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు హాజరయ్యారు.
దివ్యాంగులకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తమను ఓటర్లు గానే చూస్తున్నారని దీని వల్ల హక్కుల సాధనకు ఇతరులపై ఆధారాపడాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: