ఎయిమ్స్ కి సంబంధించి విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్ హాలులో మొదటి ఏడాది వైద్య విద్యార్థుల స్వాగత కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ఎయిమ్స్ డైరెక్టర్ ముఖేష్ త్రిపాఠి, ఎయిమ్స్ అధ్యక్షులు రవికుమార్, ఎయిమ్స్ సహాయ ఆచార్యులు విద్య పాల్గొన్నారు. వైద్య విద్యార్థులు నిరంతరం నేర్చుకోవడం ద్వారా తమ వృత్తిలో రాణించగలరని డా.రవికుమార్ అన్నారు. ఈ ఏడాది ఎయిమ్స్ లో 50 మంది విద్యార్థులు తొలి ఏడాదిలో చేరగా....వారందరికీ వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా తెల్ల దుస్తులు(ఆఫ్రాన్) అందజేశారు. మన చుట్టుపక్కల ఎవరికైనా గుండె పట్టేసినప్పుడు ఎలా స్పందించాలన్న దానిపై ప్రథమ చికిత్సలో భాగంగా....యువ వైద్యులకు, తల్లిదండ్రులతోపాటు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు తమ వృత్తిలో నిబద్ధత, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీచూడండి.అరుదైన రికార్డు... 73 ఏళ్లకు గర్భం