రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలను తిప్పి కొట్టి.. అమరావతిని కాపాడతామని అమరావతి న్యాయవాదుల ఐకాస, కృష్ణా జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. నేడు ఉదయం 11 గంటలకు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఎన్జీవోలను ఆహ్వానించామని విజయవాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. న్యాయవాదుల ఐకాస తరపున ఇప్పటికే నిరసన దీక్షలు, ప్రదర్శనలు నిర్వహించామని చెప్పారు. హైకోర్టు చొరవతోనే రైతుల అభ్యంతరాల స్వీకరణకు విధించిన గడువు పెంచారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజలను, పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: