ETV Bharat / state

పెనమలూరు తహసీల్దార్​ కార్యాలయంలో ఏసీబీ సోదాలు - ACB searches Penamalur Tehsildar office in Krishna

ACB searches Penamalur Tehsildar office: పెనమలూరు తహసీల్దార్​ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. ఎమ్మార్వో భద్రుపై అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. భద్రు ఇంటితో సహా కార్యాలయంలో తనిఖీలు చేసి.. విలువైన పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

ACB searches Penamalur Tehsildar
పెనమలూరు తాసిల్దార్ నివాసంలో ఏసీబీ అధికారులు
author img

By

Published : Nov 11, 2022, 4:18 PM IST

ACB searches Penamalur Tehsildar office: కృష్ణాజిల్లా పెనమలూరులో ఏసీబీ సోదాలు జరిగాయి. నియోజకవర్గ కేంద్రమైన పెనమలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఎమ్మార్వో భద్రుపై వచ్చిన ఫిర్యాదు మేరకు.. అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేపట్టారు. కార్యాలయంలో రికార్డులు పూర్తిగా తనిఖీలు చేశారు. భద్రు నివాసంలో కూడా ఏసీబీ సోదాలు చేపట్టింది. ఉదయం 5గంటల నుంచి ప్రారంభించిన సోదాలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ రెండు చోట్లనే కాకుండా.. మరో రెండు చోట్ల కూడా సోదాలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా భద్రు ఇంటి నుంచి విలువైన పత్రాలు, ఆభరణాలు, నగదు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.