అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు ఆజాద్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు.
ఆజాద్ సేవల స్మరణ..
అనంతరం దేశానికి మౌలానా ఆజాద్ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, రామకృష్ణ , పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్, దారపనేని నరేంద్ర, మస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనతే ఆజాద్కే దక్కుతుంది: సీఎం జగన్