కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ సమీపంలోని కృష్ణానదిలో మునిగి ఓ విద్యార్థి మృతి చెందాడు. శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి కొవిడ్-19 పరీక్షల కోసం వచ్చిన 9 మంది విద్యార్థులు పక్కనే ఉన్న కృష్ణానదిలో స్నానం చేయడానికి వెళ్లారు. ఈత కొడుతూ.. ఉండగా కొడాలికి చెందిన పోరంకి జయ కిరణ్అ నే విద్యార్థి ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయాడు. అయితే కిరణ్ ఆచూకీ కోసం స్థానికులు నదిలో గాలింపు చేపట్టగా మృతదేహం దొరికింది. కేసు నమోదు చేసిన ఘంటసాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: