ETV Bharat / state

బీ అలర్ట్ .. మీ ఖాతాలో సొమ్ము ఎప్పుడైనా పోవచ్చు... - సైబర్ నేరగాళ్లు

ఆన్​లైన్ వినియోగం ఎక్కువైపోతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నయా ట్రెండ్​తో టోపీలు పెడుతున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి శైలి మార్చుకుంటున్నారు. ఆశ చూపించి ఆస్తులు కాజేస్తున్నారు. ఉపాధి ఇస్తామంటూ జేబు ఖాళీ చేస్తున్నారు.

బీ అలర్ట్ .. మీ ఖాతాలో సొమ్ము ఎప్పుడైనా పోవచ్చు...
author img

By

Published : Sep 3, 2019, 9:46 AM IST

విజయవాడలో ఓ యువకుడు పార్ట్ టైం ఉద్యోగం కోసం ఆన్​లైన్ సైట్లలో వెతికాడు. రోజుకు 2 నుంచి 3 గంటలు పని చేస్తే చాలు... తక్కువ రోజుల్లో 8వేల రూపాయలు సంపాధించవచ్చనే ప్రకటన చూశాడు. ముందుగా రూ. 3 వేలు చెల్లించాలన్న నిబంధన ప్రకారం... నగదు వారి ఖాతాలో వేశాడు. సొమ్ము అందుకున్న సదరు సంస్థ నుంచి ఇంత వరకు స్పందన లేదు. సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేశాడు.
45 లక్షల రూపాయలు గెలుచుకున్నారనే సందేశం వచ్చింది ఇంకో వ్యక్తి. సందేశం కింద ఉన్న లింక్ నొక్కితే ఓ అప్లికేషన్ వచ్చింది. ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు అన్నీ ఇచ్చేశాడు. వెంటనే బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి నగదు మాయమైంది. చివరికి మోసం చేసుకున్న బాధితుడు తల పట్టుకున్నాడు
మనిషి బలహీనతే ఎదుటి సైబర్‌ నేరగాళ్ల ఆయుధం. రూ.60వేల విలువైన ఫోన్ కేవలం రూ. 20 వేలకే వస్తుందని ప్రకటన చూసి ఓ మహిళ సదరు నెంబర్‌కు ఫోన్‌ చేసింది. అతన్ని కలిసి రూ. 5 వేలు ఇచ్చింది. అంతే మళ్లీ వస్తానని చెప్పి ఇంతవరకు కనిపించకుండా పోయాడు. ఫోన్‌ ఎప్పటిలాగానే స్విచ్ఛాఫ్‌.
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వలవేసి డబ్బు వసూలు చేసే ఘటనలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లకు నిరుద్యోగులే గురి. మీ బయోడేటా షార్ట్ లిస్ట్​లో ఎంపికైందని... మరో రౌండ్ ముందుకెళ్లాలంటే మూడు వేలు చెల్లించాలంటూ వల వేస్తారు. బాధితుల నుంచి అందినంత దోచుకుంటారు.

ఇంత జరుగుతుంటే పోలీసులు ఏంచేస్తున్నారు?

సైబర్ క్రైమ్ ఇప్పుడు పోలీసులకు పెను సవాల్​గా మారుతోంది. రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్నా పరిష్కారమవుతున్నవి చాలా తక్కువే. విశాఖలో అత్యధికంగా ఈ నేరాలు జరుగుతున్నాయి. గుంటూరు రెండో స్థానంలో ఉంది. నేరాలు తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ టూల్స్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉంచారు. అయినా నిపుణుల కొరత పోలీసు శాఖను ను వెంటాడుతుంది. సైబర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు స్వీకరించి నేరుగా దర్యాప్తు చేసే అవకాశం సైబర్ క్రైమ్ పోలీసులకు లేదు. దీంతో కేసు దర్యాప్తుకు చాలా సమయం పడుతోంది.

బీ అలర్ట్ .. మీ ఖాతాలో సొమ్ము ఎప్పుడైనా పోవచ్చు...

ఇదీ చూడండి

వివేకా హత్యకేసులో అనుమానితుడు ఆత్మహత్య

Intro:ap_cdp_16_03_atmahathya_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య పాల్పడ్డాడు. కడప ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయి కావడంతో తో పులివెందుల పోలీసులు గత నెలరోజుల నుంచి విచారణ పేరిట పోలీస్ స్టేషన్కు తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ పేరిట తీవ్రంగా హింసించడం తో చెడు పదజాలంతో దూషించాడు. విరక్తి చెంది నిన్న పులివెందులలోని తన పంట పొలాల్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న అతని బంధువులు కడపలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వేధింపులు మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. పోలీసుల వేధింపులు వల్లే చనిపోతున్నట్లు సూసైడ్ లెటర్ రాశాడు ఓ లెటర్ ను ముఖ్యమంత్రికి ఇచ్చేందుకు కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇంతలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Body:వివేకానంద మర్డర్ కేసులో ముద్దాయి ఆత్మహత్య

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.