ETV Bharat / state

వరుస చోరీలతో హడలెత్తిపోతున్న ప్రజలు

author img

By

Published : Jul 26, 2019, 1:35 PM IST

కృష్ణాజిల్లాలో వరుస చోరీలు కొనసాగుతున్నాయి. ఊరెళ్లి తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్ల చేస్తున్నారు దొంగలు. వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు.

కంకిపాడులో వరుస చోరీలు
కంకిపాడులో వరుస చోరీలు

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో వరుస చోరీలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం గ్రామంలోని లాక్ రోడ్డులో దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తి స్థానికుల సహకారంతో పోలీసులకు దొరికాడు. ఈ ఘటన మరవకముందే కంకిపాడు మసీదు సమీపంలో శైలజ అనే మహిళ ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. శైలజ తన కుమార్తె ఇంటికి వెళ్లి ఉదయం వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువాలో దాచిన 30 వేల నగదు, బంగారం, వెండి అపహరణకు గురయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా వరుస చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఇది చూడండి: నెల గడిచినా...లభ్యం కాని బాబు ఆచూకీ !

Intro:ఉద్యోగ భద్రత కల్పించాలని ఎంపీ ఈ వో లు నిరసన

Body:ఎంపీ ఈ ఓ లకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉదయగిరి సహాయ వ్యవసాయ సంచాలకులు కార్యాలయం వద్ద రైతు సంఘం నాయకులు తో కలసి ఎం పి డి ఓ లు బైఠాయించి నిరసన తెలిపారు. రైతు సంఘం జిల్లా నాయకుడు వెంకయ్య మాట్లాడుతూ ఎం పీ ఈ ఓ లను తొలగించాలని నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగాల్లో ప్రస్తుతం పని చేస్తున్న ఎంపీఈఓలకు అవకాశం కల్పించి వారి సేవలు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎం పి ఈ ఓలకు రూ.18 వేలు వేతనం చెల్లించాలన్నారు. రాజకీయ వేధింపులను విడనాడి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం వద్ద కొంత సమయం పాటు బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపి తాసిల్దార్ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు.

Conclusion:రిపోర్టర్ : జి.శ్రీనివాసులు, ఉదయగిరి
సెల్ నెంబర్ :800573944
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.