TDP Leaders Medical Camp : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. గుడ్లవల్లేరు మండలంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపును కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గుడివాడ కోఆపరేషన్ అర్బన్ బ్యాంకు చైర్మన్ పిన్నమనేని పూర్ణ వీరయ్య (బాబ్జి ), గుడివాడ నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ రావి వెంకటేశ్వర రావులు ప్రారంభించారు.
మెగా మెడికల్ క్యాంపులో 12 విభాగాలకు సంబందించిన డాక్టర్లు పాల్గొని వైద్య సహాయాన్ని అందించారు. మెగా మెడికల్ క్యాంపు ద్వారా సుమారు 2500 మందికి వైద్య పరీక్షలు చేయించి.. ఉచితంగా మందులు, కళ్ళజోళ్లు అందచేశారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చిన వైద్య సిబ్బంది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. అన్ని ప్రముఖ హాస్పిటల్స్ నుంచి వచ్చిన వైద్య సిబ్బంది మెగా మెడికల్ క్యాంపులో పాల్గొన్నారు. గుండె, షుగర్, బీపీ, గైనిక్, దంత, ఆర్థో, కంటికి సంబందించిన సమస్యలతో పాటు జనరల్ మెడికల్ సమస్యలతో బాధ పడుతున్నవారికి వైద్య సేవలు అందజేశారు. మెగా మెడికల్ క్యాంపులో వైద్య సేవల కోసం వచ్చిన వారికి అన్న క్యాంటీన్ ద్వారా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని వెనిగండ్ల రాము చేతుల మీదుగా నిర్వహించారు.
ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్బంగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మెగా మెడికల్ క్యాంపులో 12 విభాగాలకు సంబందించిన డాక్టర్లు పాల్గొని వైద్య సహాయాన్ని అందించారని అన్నారు. కంటి సమస్యలు, క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు మందులు అవసరమైతే ఆపరేషన్లు చేయిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గుడ్లవల్లేరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొసరాజు బాపయ్య చౌదరి, వల్లభనేని వెంకటరావు, ఈడుపుగంటి ఉమామహేశ్వరరావు, పొట్లూరి రవి, జంగం మోహనరావు, చాపరాల బాలాజీ, చాపరాల రాజా, అట్లూరి ప్రసాద్, వీరమాచినేని శివప్రసాద్, గుడివాడ నియోజకవర్గ తెలుగు మహిళ తూము పద్మ, వైస్ ఎంపీపీ మరీదు నాగ లక్ష్మి, మాజీ ఎంపీటీసీ టి. నాగలక్ష్మి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :