తమ గ్రామసమ్యలను తీర్చాలని ఓ వ్యక్తి పాటుపడ్డాడు. గ్రామంలో బస్సు సౌకర్యం కోసం కాలినడకన ముఖ్యమంత్రికి దగ్గరికి బయలుదేరారు. ఏమైందో ఏమో..మధ్యలోనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. గంటలోనే పంపామని మీడియాతో పోలీసులు చెప్పారు. కానీ అతను ఇంకా ఇంటికి రాలేదు. అతను ఎక్కడున్నాడో..ఏమో అని గ్రామస్థులు కలవరపడుతున్నాడు.
కృష్ణా జిల్లా ముసునురు మండలం బలివే గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ... ఆంజనేయులు అనే వ్యక్తి అమరావతికి బయలు దేరాడు. నూజివీడుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్ధులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ సమస్యలపై పలు మార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకపోవడంతో.. ముఖ్యమంత్రి కార్యాలయంకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అమరావతికి కాలి నడకన బయలుదేరాడు.
అలా వెళ్తూ ఉండగా.. మార్గమధ్యలో ఆంజనేయులును పోలీసులు అడ్డుకొని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. నిన్న ఉదయం పోలీసుస్టేషన్‌కు వెళ్లిన ఆంజనేయులు ఇప్పటివరకు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి గంటలో పంపించివేశామని.. మీడియాకు పోలీసు అధికారులు తెలిపారు. అంజనేయులు ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. అతను ఎక్కడున్నాడో.. ఏమో, తిన్నాడో..లేడో, బతికున్నాడో ..లేడో అని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చూడండి. కడప పాత బస్టాండులో ఓ వ్యక్తి వీరంగం