కృష్ణా జిల్లా విజయవాడ - నూజివీడు బైపాస్ వద్ద కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. లారీలోని వందల కోళ్లు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ గాయాలపాలవగా.. అతన్ని స్థానికులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో లారీ తాలుకా వారు ఎవరు లేకపోవడంతో కోళ్లన్నీ చోరీకి గురయ్యాయి. ఆ దారి వెంట వెళ్లిన వాహనదారులు చనిపోయిన కోళ్లను తీసుకువెళ్లారు. గంట వ్యవధిలోనే లారీలో కోళ్లన్నీ మాయం అయ్యాయి.
ఇదీ చదవండి: