కృష్ణా జిల్లా నందిగామ బైపాస్ రోడ్డు వై జంక్షన్ సమీపంలో ఓ కారు పల్టీ కొట్టింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో ముగ్గురు ఉండగా.. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో ఆ కారును అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: