ఒకప్పుడు నగరాలకే పరిమితమైన గంజాయి కల్చర్... ఇప్పుడు పల్లెలకు పాకింది. కాలేజీ యువతను టార్గెట్ చేసుకుని కొందరు గంజాయి దందా సాగిస్తున్నారు. గంజాయి రవాణా గుట్టును అవనిగడ్డ పోలీసులు రట్టు చేశారు. విశాఖకు చెందిన వ్యాపారిని, రవాణా చేస్తున్న మరో 9 మందిని పోలీసులు అరెష్టు చేశారు. రవాణా, అమ్మకాలు చేస్తూ పట్టుబడిన వారిలో ఏడుగురు విద్యార్థులు, ఒక బ్యాంకు ఉద్యోగి ఉన్నారు.
అరెస్ట్ అయిన వారి నుంచి 10 కిలోల గంజాయి, రూ.5200 నగదు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నాగాయలంకలో జరుగుతున్న అమ్మకాల ఆధారంగా నిఘా పెట్టిన పోలసులు... జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అమ్మకాలు చేస్తున్నవారిని, రవాణాదారులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రమేష్ రెడ్డి వివరించారు.
ఇదీ చదవండి: