ఐదు వేల మంది ఐటీఐ అప్రెంటిస్‌ల నియామకానికి ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. ఏప్రిల్ 15కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని నాలుగు జోన్లు.. కడప, నెల్లూరు, విజయనగరం, విజయవాడలకుగాను.. డీజిల్ మెకానిక్‌లు 3160, మోటార్ మెకానిక్‌లు 200, ఎలక్ట్రీషియన్లు 560, వెల్డర్లు 160, పెయింటర్లు 320, మిల్‌రైట్ మెకానిక్‌లు 52, మెషినిస్ట్‌లు 16, షీట్ మెటల్ వర్కర్లు 520, సివిల్ డ్రాఫ్ట్స్‌మెన్‌లు 12 మందికి అవకాశముందని ఆ ప్రకటనలో వెల్లడించింది. అర్హత కలిగిన ఐటీఐ అభ్యర్థులు తమ దరఖాస్తులను సంస్థ వెబ్‌సైట్‌లో ఈ నెల 21వ తేదీలోపు సమర్పించాల్సిందిగా కోరింది. ఆయా జోన్లవారీగా ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్ 9న నిర్వహిస్తామని, 13న ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించి వారిని 15న రీజియన్ వర్క్‌షాపులకు కేటాయిస్తామని తెలిపింది.
ఆర్టీసీలో 5 వేల మంది ఐటీఐ అప్రెంటిస్‌లకు అవకాశం - ఆర్టీసీలో 5 వేల మంది ఐటీఐ అప్రెంటిస్‌లకు అవకాశం
ఆర్టీసీలో ఐటీఐ అప్రెంటిస్ ల నియామాకానికి ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. అర్హత కలిగిన ఐటీఐ అభ్యర్థులు తమ దరఖాస్తులను సంస్థ వెబ్‌సైట్‌లో ఈ నెల 21వ తేదీలోపు సమర్పించాల్సిందిగా కోరింది.
ఐదు వేల మంది ఐటీఐ అప్రెంటిస్‌ల నియామకానికి ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. ఏప్రిల్ 15కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని నాలుగు జోన్లు.. కడప, నెల్లూరు, విజయనగరం, విజయవాడలకుగాను.. డీజిల్ మెకానిక్‌లు 3160, మోటార్ మెకానిక్‌లు 200, ఎలక్ట్రీషియన్లు 560, వెల్డర్లు 160, పెయింటర్లు 320, మిల్‌రైట్ మెకానిక్‌లు 52, మెషినిస్ట్‌లు 16, షీట్ మెటల్ వర్కర్లు 520, సివిల్ డ్రాఫ్ట్స్‌మెన్‌లు 12 మందికి అవకాశముందని ఆ ప్రకటనలో వెల్లడించింది. అర్హత కలిగిన ఐటీఐ అభ్యర్థులు తమ దరఖాస్తులను సంస్థ వెబ్‌సైట్‌లో ఈ నెల 21వ తేదీలోపు సమర్పించాల్సిందిగా కోరింది. ఆయా జోన్లవారీగా ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్ 9న నిర్వహిస్తామని, 13న ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించి వారిని 15న రీజియన్ వర్క్‌షాపులకు కేటాయిస్తామని తెలిపింది.
ఇదీ చూడండి:'చపాతీ' ఆమె జీవితాన్నే మార్చేసింది!