రాష్ట్రంలో కొత్తగా 4,228 కరోనా కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు అధికారులు వివరించారు. కొవిడ్ బారి నుంచి మరో 1,483 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 25 వేల 850 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో 24 గంటల్లో 35,582 మందికి కరోనా పరీక్షలు