గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 120 మందికి కరోనా సోకింది. అత్యధికంగా చిత్తూరులో 35 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 17, కృష్ణాలో 25, గుంటూరులో 6, తూర్పు గోదావరి జిల్లాలో 5, నెల్లూరు 9, కడపలో10, శ్రీకాకుళంలో 3, కర్నూలులో 2 ,ప్రకాశం 2, అనంతపురంలో 4 , విజయనగరం 2 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కేసులు నమోదు కాలేదు. వీటితో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 8 లక్షల 91 వేల 4కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1064 గా వైద్యాధికారులు తెలిపారు.
గడచిన 24 గంటల వ్యవధిలో 93మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8 లక్షల 82 వేల 763కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల చిత్తూరులో ఒకరు మరణించారని అధికారులు ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 7 వేల 177 కి చేరింది.
ఇవీ చదవండి 'తెదేపా అభ్యర్థిని కులం పేరుతో దూషించిన ఎస్సైపై చర్యలు తీసుకోండి'