ETV Bharat / state

Rape in mamidikuduru: వైద్యం చేసేందుకు వచ్చి.. బాలికపై కన్నేసి.. - ఏడో తరగతి విద్యార్థినిపై ఆర్​ఎంపీ వైద్యుడు అత్యాచారం

Rape in mamidikuduru: కోనసీమ జిల్లా మామిడికుదురులో.. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. వైద్యం చేసేందుకు కొన్నిరోజుల కిందట ఇంటికి వచ్చిన ఆర్​ఎంపీ వైద్యుడు.. బాలిక దగ్గర ఫోన్ నెంబర్‌ తీసుకుని పరిచయం పెంచుకున్నట్లు ఆమె తండ్రి పేర్కొన్నారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

student Raped in mamidikuduru at konaseema district
ఏడో తరగతి విద్యార్థినిపై ఆర్​ఎంపీ అత్యాచారం
author img

By

Published : May 4, 2022, 12:33 PM IST

Rape in mamidikuduru: కోనసీమ జిల్లా మామిడికుదురులో ఏడో తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. బాలికపై ఆర్​ఎంపీ వైద్యుడు వేగి రమేశ్‌ అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైద్యం చేసేందుకు కొన్నిరోజుల కిందట ఇంటికి వచ్చిన ఆర్​ఎంపీ వైద్యుడు.. తన కుమార్తె ఫోన్ నెంబర్‌ తీసుకున్నట్లు ఆమె తండ్రి పేర్కొన్నారు.

ఆమెతో పరిచయం పెంచుకున్న రమేశ్‌.. సోమవారం రాత్రి నాన్నమ్మతో కలిసి డాబాపై బాలిక నిద్రిస్తున్న సమయంలో అత్యాచారానికి ఒడిగట్టినట్లు చెప్పారు. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు నాన్నమ్మ కిందికి వెళ్లిందని.. ఇదే అదునుగా భావించిన నిందితుడు ఈ ఘాతుకానికి తెగబడినట్లు వివరించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు.. నగరం ఇన్‌ఛార్జి ఎస్సై కృష్ణమాచారి వెల్లడించారు.

విద్యార్థినిపై ఆర్​ఎంపీ అత్యాచారం కేసు వివరాలను వెల్లడించిన ఎస్సై కృష్ణమాచారి

ఇదీ చదవండి:

గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య.. ముగ్గురు సస్పెన్షన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.