ROAD DAMAGE IN CHADHARGHAT: హైదరాబాద్ నగర వాహనదారులకు పెనుముప్పు తప్పింది. చాదర్ఘాట్ ప్రధాన రహదారిపై భారీగా గొయ్యి ఏర్పడింది. ఇది గమనించి అటుగా వెళుతున్న పోలీసులు వెంటనే రక్షణ చర్యలకు పూనుకున్నారు. గొయ్యి చుట్టూ రక్షణ కవచంలా బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. రోడ్డు కింద మురుగు కాలువ ఉన్నట్లు జీహెచ్ఎంసీ సిబ్బంది గుర్తించారు. ఆ డ్రైనేజ్ లోతు 20 ఫీట్లు ఉంటుందని మున్సిపాలిటీ సిబ్బంది అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి: