ETV Bharat / state

ఏసీబీ పేరుతో మోసాలు ఏకంగా పోలీసులకే టోకరా - కట్ చేస్తే కటకటాలపాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2024, 12:37 PM IST

Police Arrested Fake ACB Officer: ఏసీబీ అధికారినంటూ ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసి డబ్బులు కొట్టేస్తున్న ఓ ఘరానా మోసగాడిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఎంతో మందిని బెదిరించిన అతను ఈ సారి ఏకంగా పోలీస్ డిపార్ట్​మెంట్ పైనే కన్నేయడంతో పోలీసులకు దొరికిపోయాడు.

police_arrest_fake_acb_officer
police_arrest_fake_acb_officer

Police Arrested Fake ACB Officer: ఏసీబీ అధికారిగా చెలామణి అవుతూ ప్రభుత్వ ఉద్యోగులు వద్ద డబ్బులు కొట్టేస్తున్న ఓ ఘరానా మోసగాడిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట రూరల్ పోలీస్​లు పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఎంతో మందిని బెదిరించిన అతగాడు ఈ సారి ఏకంగా పోలీస్ డిపార్ట్​మెంట్ పైనే కన్నేశాడు. మండపేట రూరల్ ఏఎస్ఐను బెదిరించి కటకటాల పాలయ్యాడు. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్​లో రామచంద్రపురం డీఎస్పీ ప్రసాద్ ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

అధికారుల ఫోటో డీపీలతో సైబర్​ నేరగాళ్ల గాలాలు - చేతికి చిక్కారో అంతే !

అనంతపురం జిల్లాకు చెందిన రాచంపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తి గత 15 సంవత్సరాలుగా ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాలలో నేర ప్రవృత్తితో బతుకుతున్నాడు. దొంగతనాలు, దోపిడీ, మోసాలు ఇలా రెండు రాష్ట్రాలలో ఇప్పటి వరకు 100కు పైగా నేరాలకు పాల్పడ్డాడు. ఇటీవల న్యూస్ పేపర్​లు, గూగుల్ సహకారంతో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను సేకరించి ఏసీబీ అధికారిగా వారిని బెదిరించి డబ్బులు దోచుకోవడం మొదలు పెట్టాడు. కాగా గత నెల 14 న మండపేట రూరల్ పోలీస్ స్టేషన్​ ఏఎస్ఐకు ఫోన్ చేసి త్వరలో మీపై ఏసీబీ దాడి జరగబోతుందని హెచ్చరించాడు. మీతో పాటు మీ బంధువులు అందరి ఇళ్లపై దాడులు జరుగుతాయని బెదిరించాడు.

ఒంగోలులో కొనసాగుతున్న భూకబ్జాలు - నకిలీ స్టాంపులు, అక్రమ రిజిస్ట్రేషన్లతో మోసాలు

రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నందున దాడి జరిగితే అనేక రకాల ప్రయోజనాలు కోల్పోతావని హెచ్చరించి ఆయన వద్ద నుంచి 5 లక్షల 5 వేల రూపాయలు ఫోన్​పే ద్వారా వసూలు చేశాడు. అయితే ఆలస్యంగా ఇది మోసమని గ్రహించిన ఏఎస్ఐ తన పోలీస్ స్టేషన్​లోనే పిర్యాదు చేశాడు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ శ్రీధర్ కేసు నమోదు చేయించి డీఎస్పీ ప్రసాద్, సీఐ శ్రీధర్ కుమార్ పర్యవేక్షణలో రూరల్ ఎస్ఐ బళ్ల శివ కృష్ణ, ఆయన సిబ్బంది నారాయణ, దొనిపాటి రవి కిషోర్, గంగరాజులను ఒక టీమ్​గా ఏర్పాటు చేసి దర్యాప్తు సాగించారు. ఈ మేరకు ఎస్ఐ శివకృష్ణ చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయి తీరు తెన్నులను గుర్తించారు.

'వర్క్ ఫ్రం హోం' మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు - పోలీసులు ఎలా పట్టుకున్నారంటే!

ఆటో డ్రైవర్​లు, తెలిసిన వారి ఫోన్​ల నుంచి శ్రీనివాసులు ఉద్యోగులను బెదిరించి, వారి నుండి డబ్బులు డిమాండ్ చేస్తాడనీ, ఆపై ఆటో డ్రైవర్​లతో మా బంధువులు ఆసుపత్రిలో వున్నారు, తెలిసిన వారు మీకు ఫోన్​పే చేస్తారు ఆ డబ్బులు తీసి ఇవ్వాలని చెప్పి పట్టుకుని వెళ్లిపోతాడనీ దర్యాప్తులో తెలుసుకున్నారు. అలాగే ఏఎస్ఐను బెంగళూరు నుంచి ఫోన్ చేసి బెదిరించినట్లు గుర్తించారు. మొత్తానికి నిందితుడిని పట్టుకుని అతని వద్ద నుంచి 2 లక్షల రూపాయలను రికవరీ చేశారు. ఈ మేరకు ముద్దాయిని అరెస్ట్ చేసి ఆలమూరు కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు చేదించిన ఎస్ఐ, ఆయన టీమ్ సభ్యులను డీఎస్పీ అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.