ETV Bharat / state

జీవనోపాధి కోల్పోతున్నామని.. కోనసీమ జిల్లాలో మత్స్యకారుల నిరసన - నేటి తెలుగు వార్తలు

Protest : అక్రమ ఇసుక తవ్వకాల వల్ల జీవనాధారాన్ని కోల్పోతున్నామని అంబేడ్కర్​ కోనసీమ జిల్లాలోని మత్స్యకారులు నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 18 వేల మంది కుటుంబాలు ఉపాధి కోల్పొయామని ఆవేదన వ్యక్తం చేశారు.

Fishermen Protest
కోనసీమ జిల్లాలో మత్స్యకారుల నిరసన
author img

By

Published : Dec 29, 2022, 9:28 PM IST

Fishermen Protest : జీవనోపాధిని కోల్పోతున్నామని డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ కోనసీమ జిల్లా మత్స్యకారులు నిరసన తెలిపారు. కోనసీమ జిల్లాలోని గంగవరం మండలానికి చెందిన కోటిపల్లి గ్రామపంచాయతీ పరిదిలో మత్స్యకారులు నిరసన చేపట్టారు. గోదావరి నదికి అడ్డుకట్ట వేసి అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టారని.. దానివల్ల తాము ఉపాధి కోల్పొయామని పడవలపై ఎక్కి నిరసన తెలిపారు. గౌతమి గోదావరి నదికి అడ్డుకట్ట వేసి ఇసుక తవ్వకాలు చేపట్టటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నదిలో అడ్డుకట్ట వేసి ఇసుక మాఫియా చేస్తున్న అక్రమ దందాల వల్ల దాదాపు 18 వేల మంది కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని వాపోయారు.

గౌతమి గోదావరి నది పరివాహక ప్రాంతలోనే కాకుండా.. ఎన్​జీటీ జియోగ్రాఫికల్​ కోస్టల్​ ఏరియాగా గుర్తించిన గోదావరి నది పరివాహక ప్రాంతలోను అడ్డుకట్ట వేశారని అన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ కిలోమీటర్ల మేర పెద్ద పెద్ద పైపులతో అడ్డుకట్టలు నిర్మించి ఇసుక తరలిస్తున్నారని అన్నారు. దీనివల్ల వరదలు వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని.. దీనివల్ల ప్రవాహానికి ఇబ్బంది కలుగుతుందని అన్నారు. అంతేకాకుండా గోదావరికి వచ్చే ఆటుపోట్లకు అంతరాయం ఏర్పాడి మత్స్య సంపద తగ్గిపోతుందని వాపోయారు. 2019 మైనింగ్​ పాలసీ ప్రకారం.. ఇసుక తవ్వకాలకు ఏ విధమైన యంత్రాలను వినియోగించకూడదని నిబంధన ఉన్నప్పటికీ, యంత్రాలను వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇసుక ర్యాంప్​ల అనుమతి నిలిపి వేసి.. చేపల వేటే జీవనోపాధిగా బతుకున్న తమ జీవనాధారాన్ని కాపాడాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.