ETV Bharat / state

ఆపదలో ఉన్నవారికి ఆసరా.. దళిత సేవా సమితి కూరగాయల పంపిణీ - డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దళిత సేవ సమితి ట్రస్ట్ కూరగాయల పంపిణీ

Dalith seva samithi trust: గోదావరి జిల్లాల దళిత సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, వరద ముంపు గ్రామాల ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు. పి.గన్నవరం ప్రభుత్వాస్పత్రిలో పాలు, బ్రెడ్లు, పండ్లు పంచిపెట్టారు.

Dalith seva samithi trust
దళిత సేవ సమితి ట్రస్ట్
author img

By

Published : Aug 3, 2022, 8:06 PM IST

Updated : Aug 3, 2022, 8:14 PM IST

Dalith seva samithi trust: డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో గోదావరి జిల్లాల దళిత సేవా సమితి ట్రస్ట్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే.ఆర్. విజయ, ఈపీఎఫ్ రిటైర్డ్ కమిషనర్ అమరేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం నేలపూడిపేటలో స్వర్గీయ నేలపూడి చిన్న లక్ష్మమ్మ జ్ఞాపకార్థం.. వరద ముంపు గ్రామాల్లోని కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు.. అమరేశ్వరరావు పాలు, బ్రెడ్​లు పంచారు. సహాయ కార్యక్రమాలు చేపట్టిన అద్దంకి అమరేశ్వరరావును గన్నవరం గ్రామ సర్పంచ్ బోండా నాగమణి శాలువాతో సన్మానించారు. డొక్కా సీతమ్మ వంటి నిత్యాన్నదానం జరిపిన దాతలు గన్నవరంలో సుప్రసిద్ధులు అని అమరేశ్వరరావు తెలిపారు.

కూరగాయల పంపిణీ కార్యక్రమంలో ధరణి ఫౌండేషన్ చైర్మన్ సరెళ్ల ప్రసాద్, ట్రస్ట్ ట్రెజరర్ గొల్లపల్లి శ్రీను, కలిగితే నాగేశ్వర, నేలపూడి సాయిబాబు, శెట్టిబత్తుల సేవా సమితి అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 3, 2022, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.