ETV Bharat / state

కోనసీమ వరద ప్రాంతాల్లో నేడు సీఎం జగన్‌ పర్యటన

CM tour in flood areas: కోనసీమ జిల్లా ముంపు గ్రామాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. నేడు పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు.

CM jagan tour in flood areas
CM jagan tour in flood areas
author img

By

Published : Jul 25, 2022, 5:33 PM IST

Updated : Jul 26, 2022, 4:46 AM IST

CM Jagan Tour: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం పర్యటిస్తారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. 10.30 గంటలకు కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం పెదపూడి గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి 11 గంటలకు పుచ్చకాయలవారిపేట వెళ్లి వరద బాధితులతో సమావేశమవుతారు. అనంతరం అరిగెలవారిపేట, ఉడి మూడీలంకల్లో వరద బాధితులను కలుస్తారు. మధ్యాహ్నం 2.05 గంటలకు వాడ్రేవుపల్లి చేరుకుని, అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం వెళ్లి వరద బాధితులతో సమావేశమవుతారు. సాయంత్రం 4.05 గంటలకు రాజమహేంద్రవరం చేరుకొని, అక్కడి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మంగళవారం సీఎం అక్కడే బస చేయనున్నారు.

సహాయచర్యలకు ఏపీఎండీసీ విరాళం..
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యల కోసం సీఎం సహాయ నిధికి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) రూ.5 కోట్ల విరాళం అందజేసింది. విరాళం చెక్కును గనులశాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచం ద్రారెడ్డి, ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంచాల ల వీజీ వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం.. జగన్మోహన్రెడ్డికి సోమవారం అందజేశారు.

ఇదీ చదవండి: సీఎం రాకతోనైనా.. వారి నరకయాతనకు అడ్డుపడేనా? వంతెన కల తీరేనా..?

Last Updated : Jul 26, 2022, 4:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.