Video: సీఎం జగన్ పెన్ను లాగేసిన చిన్నారి.. ఆ తర్వాత - సీఎం జగన్ పెన్ను లాగేసిన చిన్నారి వార్తలు
CM Jagan Tour: కోనసీమ జిల్లాలోని గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పి.గన్నవరం మండలం జి. పెదపూడిలంకలో వరద బాధితులను పరామర్శించిన జగన్.. ఓ ఎనిమిది నెలల చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకున్నాడు. అనంతరం అక్కడి వరద బాధితులతో మాట్లాడుతుండగా చిన్నారి విజయ చైతన్య సీఎం జగన్ జేబులో పెన్నును లాగేశాడు. పెన్ను కింద పడిపోగా.. భద్రతా సిబ్బంది తీసి జగన్కు ఇచ్చారు. "పెన్ను కావాలా నీకు.. కావాల్నా. ఇదిగో పట్టుకో" అంటూ సీఎం ఆ చిన్నారికి పెన్నును ఇచ్చి ముందుకు సాగారు.