ETV Bharat / state

Chandrababu Meeting with Intellectuals in Amalapuram: "రాష్ట్ర భవిష్యత్తు కోసం మేధావులు ఆలోచించాలి.. అభివృద్ధిలో భాగం కావాలి" - ప్రజావేదిక కార్యక్రమం

Chandrababu Meeting With Intellectuals in Amalapuram: రాష్ట్ర భవిష్యత్తు కోసం మేధావులు ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అందరూ కలిసి ముందుకు వెళ్తే సమాజం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని సూచించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటిస్తున్న ఆయన మేధావులతో సదస్సు నిర్వహించారు.

Chandrababu_Meeting_With_Intellectuals
Chandrababu_Meeting_With_Intellectuals
author img

By

Published : Aug 18, 2023, 4:14 PM IST

Updated : Aug 18, 2023, 5:22 PM IST

Chandrababu Meeting with Intellectuals in Amalapuram: "రాష్ట్ర భవిష్యత్తు కోసం మేధావులు ఆలోచించాలి.. అభివృద్ధిలో భాగం కావాలి"

Chandrababu Meeting With Intellectuals in Amalapuram: రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం ఆలోచన చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్క్​ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్​లో జరిగిన మేధావుల ప్రజా వేదిక సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజంలో వెనకబడిన వారిని ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో పనిచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మేధావులు సైతం ఆలోచన చేయాలని సూచించారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విడిపోవడం మంచిది కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంస్కరణ తీసుకొచ్చి మంచి ఫలితాలు సాధించిందని చంద్రబాబు పేర్కొన్నారు.

Chandrababu Public Meeting at Ravulapalem: యువత గంజాయి మత్తుకు బానిసై జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు: చంద్రబాబు

Chandrababu Amalapuram Tour: డాక్టర్లు, టీచర్లు, లాయర్లు కలిసి పని చేస్తే సమాజం అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు(TDP Chandrababu) అన్నారు. అమలాపురంలో వారితో సమావేశమైన ఆయన.. అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజన్-2047 డాక్యుమెంట్‌ ప్రకారం రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. మేధావులు, నిపుణుల నుంచి మరిన్ని సలహాలు, సూచనలు స్వీకరించి.. విజన్‌ డాక్యుమెంట్‌ను పొందుపరుస్తామన్నారు. వైద్యులు, న్యాయవాదులు, పలువురు మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

TDP Leader Chandrababu Criticized CM Jagan: సైకో పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం.. దసరాలోగా నూతన పాలసీ: చంద్రబాబు

"మేధావులంతా ఒకసారి ఆలోచించాలి. సమాజంలో వెనుకబడిన వారిని ముందుకు నడిపిస్తా. ఆర్థిక సంస్కరణలు వచ్చాక పోటీతత్వం వచ్చింది. ఇంజినీరింగ్‌ కళాశాలలు పెడితే నన్ను ఎగతాళి చేశారు. ఇక్కడ చదువుకున్నవాళ్లు విదేశాల్లో స్థిరపడిపోయారు. ప్రపంచాన్ని జయించే శక్తి భారతీయ యువతలోనే ఉంది. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది." -చంద్రబాబు, టీడీపీ అధినేత

Chandrababu Meeting With Women in Amalapuram: తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే మహిళల అభివృద్ధి సాధ్యపడిందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్​లో మహిళా వేదిక సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి మహిళల కోసం పాటుపడ్డారని గుర్తు చేశారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను మరింత ముందుకు తీసుకువెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా నిలబెట్టామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు.. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు.

Chandrababu Fires on CM Jagan: జగన్ పనైపోయింది.. దేవుడు కూడా కాపాడలేరు: చంద్రబాబు

"తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా నిలబెట్టాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం." -చంద్రబాబు, టీడీపీ అధినేత

Today Chandrababu Public Meeting at Amalapuram: కాగా ఈరోజు సాయంత్రం అమలాపురంలో చంద్రబాబు రోడ్డు షో నిర్వహించి, అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ క్రమంలో అమలాపురం పసుపమయంగా మారింది. అమలాపురంలోని ప్రధాన కూడళ్లలో పసుపు జెండాలు, స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో నింపేశారు.

Chandrababu Criticized YCP Government: వైసీపీ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది: చంద్రబాబు

Last Updated : Aug 18, 2023, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.