ETV Bharat / state

'ఆ సమయానికి యుద్ధం మొదలుపెడదాం'..వాట్సప్ సందేశంతో అమలాపురం విధ్వంసకాండ - Amalapuram incident

అమలాపురం విధ్వంసం ఘటన సృష్టించేందుకు వాట్సప్‌ గ్రూపుల ద్వారా విరివిగా సమాచారం చేరవేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మెత్తం 20 వాట్సప్‌ గ్రూపుల ద్వారా వివరాలు పంచుకున్నారని వెల్లడించారు. తాజాగా ఘటనలో పాల్గొన్న 25 మందిని అరెస్ట్‌ చేయగా.. వీరిలో ఎక్కువ మంది వైకాపా కార్యకర్తలే ఉండటం గమనార్హం.

'ఆ సమయానికి యుద్ధం మొదలుపెడదాం'
'ఆ సమయానికి యుద్ధం మొదలుపెడదాం'
author img

By

Published : May 29, 2022, 3:56 AM IST

Updated : May 29, 2022, 5:44 AM IST

వాట్సప్ సందేశంతో అమలాపురం విధ్వంసకాండ

'సరిగ్గా.. 3 గంటల 10 నిమిషాలకు యుద్ధం మొదలుపెడదాం..! పోలీసులు భోజనం చేస్తున్నారు... అమలాపురం టౌన్‌లోకి రావడానికి ఇదే మంచి సమయం'. ఇవీ.. ఈ నెల 24 న అమలాపురం ఘటనకు ముందు వాట్సప్​ గ్రూపుల్లో చెక్కర్లు కొట్టిన సందేశాలు. సంబంధిత ఘటనపై ఆరా మొదలుపెట్టిన పోలీసులకు వాట్సప్ గ్రూపుల్లో పంచుకున్న ఇలాంటి అనేక సందేశాలు కనిపిస్తున్నాయి. ఈ సందేశాలే అమలాపురంలో విధ్వంసానికి కారణమయ్యాయని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు వెల్లడించారు. విధ్వంసం కేసులో మరో 25 మందిని అరెస్ట్‌ చేశామని.. 144 సెక్షన్‌ను మరో 5 రోజులు పొడిగించినట్లు తెలిపారు.

శనివారం అరెస్ట్‌ చేసిని 25 మందిలో 18 మంది వైకాపా కార్యకర్తలు ఉండటం గమనార్హం. వారిలో ఇద్దరేసి తెదేపా, జనసేన కార్యకర్తలు కాగా.. మిగిలిన వారు సాధారణ పౌరులు. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. డీజీపీ కార్యాలంయం నుంచి నిత్యం తాజా పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. నాలుగు రోజులుగా అమలాపురంలో నిలిచిన ఇంటర్నెట్‌ సేవలు.. ఇంకా పునరుద్ధరించ లేదు. పాలిసెట్‌ అభ్యర్థుల కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ శుక్లా తెలిపారు.

అమలాపురం విధ్వంసంలో పాల్గొన్న వారిని పలు విధాలుగా గుర్తిస్తున్నామని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు తెలిపారు. 20 వాట్సప్‌ గ్రూపుల ద్వారా సమాచారం పంచుకున్నారని ఎంతమంది ఎప్పుడు ఎక్కడకు చేరుకోవాలనే సందేశాలు ఉన్నాయని తెలిపారు. డిలీట్‌ చేసిన మెసేజ్‌లనూ సాంకేతికత ఆధారంగా పరిశీలిస్తున్నామని, అరెస్టు చేసిన వారి ఆస్తులను జప్తు చేస్తామని చెప్పారు. అమాయకులపై కేసులు పెట్టబోమని, తప్పు చేసని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఏం జరిగిందంటే : కోనసీమ జిల్లా అమలాపురం ఈనెల 24న ఆందోళనలతో అట్టుడికింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.

సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఇవీ చూడండి

Last Updated : May 29, 2022, 5:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.