డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రధాన రహదారిపై ఉన్న గుంతలో బస్సు ఇరుక్కుపోయింది. కొత్తపేట నుంచి అమలాపురానికి వెళ్లే రహదారిలో పెద్ద పెద్ద గుంతలు పడి రోడ్డు పూర్తిగా పాడైపోయింది. రాజమహేంద్రవరం నుంచి అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు రహదారిపై ఉన్న గుంతలో ఒక్కసారిగా కూరుకుపోయింది. బస్సు కింద భాగం పూర్తిగా కనపడకుండా, రెండు చక్రాలు గుంతలోకి ఇరుక్కుపోవడంతో..బస్సు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికలందరు కిందకు దిగి, తలో చేయి వేసి నెట్టడంతో గుంతలో నుంచి బస్సు బయటపడింది.ఈ గుంతల కారణంగా రోజు సమస్య ఏర్పడుతున్నాయని, బస్సులు కూడా పాడైపోతున్నాయని డ్రైవర్లు వాపోతున్నారు.
ఇవి చదవండి : 20 కి.మీ.ల మేర 100 గుంతలు.. సర్కార్‌పై విమర్శలు.. ఇదీ అక్కడి హైవే దుస్థితి!