Zone-2 Review Meeting led by Chandrababu in Kakinada: బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపాలని నిర్ణయించి.. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాచరణ సిద్ధంచేసింది. టీడీపీ నాయకులంతా ప్రజలతో కలవనున్నారు. అందులో భాగంగా చంద్రబాబు నేతృత్వంలో కాకినాడలో జోన్-2 సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తొలి మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. . 45 రోజుల కార్యక్రమం ప్రారంభమయన రెండో రోజే కాకినాడలో జోన్- 2 నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు సమీక్ష నిర్వహిస్తారు.
Babu Surety Future Guarantee Program: 45 రోజులు.. 3 కోట్ల మంది ఓటర్లు లక్ష్యం.. టీడీపీ కొత్త కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
Arrangements for Zone 2 review meeting: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలకమైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి సమరానికి సన్నద్ధంచేయడానికి సాక్షాత్తూ అధినేత రంగంలోకి దిగారు. కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి వద్ద నన్నయ పీజీ సెంటర్ ఎదురుగా మీసాలరాజు ప్రాంగణంలో టీడీపీ జోన్-2 సమీక్షకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఉదయ గోదావరి జిల్లాల పరిధిలోని అయిదు లోక్సభ స్థానాల పరిధిలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జిలు, ముఖ్య నాయకులు 3,500 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. 45 రోజులపాటు జరగనున్న
Chandrababu schedule in Kakinada: చంద్రబాబు శనివారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. అనంతరం 12.30 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ గ్రామీణం అచ్చంపేట సమావేశ వేదిక వద్దకు వస్తారు. సాయంత్రం 6.45 గంటల వరకు సమీక్షలో పాల్గొంటారు. 7 గంటలకు ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కుమార్తె వివాహ వేడుకలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం రాజనుహేంద్రవరం విమానాశ్రయానికి బయల్దేరి అక్కడి నుంచి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని టీడీపీ ముఖ్య నాయకులతో ఏర్పాటుచేసే.. జోన్-2 సమావేశానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
Prathipati Pullarao comments on YCP rule: రాష్ట్రంలో వైసీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని.. జగన్ ఇంటికి పంపించడం ఖాయమని మాజీ మంత్రి తెలుగుదేశం సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచించుకావాలని అన్నారు. మంత్రులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. కాకినాడ అచ్చంపేటలో నిర్విహించే 36 నియోజకవర్గాల ప్రతినిధులతో రేపు టీడీపీ జోన్ 2 సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు. అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులతోపాటు వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులపై పెట్టిన కేసులు, దాడులపై చర్చించనున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ టీడీపీ పథకాలను కాపీ కొట్టారని.. మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి చెప్పారు.