Yanamala Ramakrishnudu allegations against Jagan: జగన్ ప్రభుత్వం అభివృద్ధి పై కాకుండా ప్రశ్నించే వారిపై, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకి దిగుతోందని.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కాకినాడ జిల్లా తునిలో దుండగుల దాడిలో గాయపడిన తెలుగుదేశం నాయకుడు పోల్నాటి శేషగిరిరావుని పరామర్శించిన అనంతరం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆయన అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించారని యనమల వెల్లడించారు.
రాష్ట్రంలో తూర్పు సముద్ర తీరాన్ని జగన్ తన బినామిల ద్వారా గుప్పెట్లో ఉంచుకున్నారని ఆరోపించారు. పరిశ్రమల పేరుతో వేల కోట్లు దోచుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారని పేర్కొన్నారు. ఆక్వా రంగాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేస్తోందని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో జగన్ దిగిపోయేనాటికి రాష్ట్రంలో అప్పు రూ. 11 లక్షల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. కాలుష్యం కారణంగా మత్స్యకారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు.
ఇవీ చదవండి: