ETV Bharat / state

సముద్రంలో భారత తీర గస్తీ దళం మాక్ డ్రిల్.. అబ్బురపరిచిన దృశ్యాలు

author img

By

Published : Mar 30, 2023, 7:12 AM IST

Updated : Mar 30, 2023, 7:35 AM IST

Indian Coast Guard mock drill: భారత తీర గస్తీ దళం సారెక్స్-2023 పేరిట కాకినాడలోని సముద్రంలో మాక్ డ్రిల్ నిర్వహించింది. సముద్ర విపత్తుల నుంచి నౌకలోని సిబ్బంది, ప్రయాణికుల్ని రక్షించే తీరును విన్యాసాల ద్వారా విజయవంతంగా ప్రదర్శించారు.

Etv Bharat
Etv Bharat

Indian Coast Guard mock drill: కాకినాడలోని సముద్రంలో భారత తీర గస్తీ దళం సారెక్స్-2023 పేరిట మాక్ డ్రిల్ నిర్వహించింది. సముద్రంలో విపత్తులు సంభవించినప్పుడు నౌకలోని సిబ్బంది, ప్రయాణికుల్ని రక్షించే తీరును విన్యాసాల ద్వారా విజయవంతంగా ప్రదర్శించారు. కాకినాడ జిల్లా యంత్రాంగం సమన్వయంతో కాకినాడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ విన్యాసాలను నిర్వహించారు.

కాకినాడ వద్ద సముద్రంలో మాక్ డ్రిల్ ప్రదర్శన.. అబ్బురపరచిన దృశ్యాలు

భారత తీర గస్తీ దళం రీజనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్స్​ర్​సైజ్-సారక్స్ 2023 పేరిట సముద్రంలో నిర్వహించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. కాకినాడ తీరం నుంచి సముద్రంలో 20 కిలోమీటర్ల దూరంలో ఈ విన్యాసాలు ప్రదర్శించారు. సముద్రంలో విపత్తు స్పందన, నిర్వహణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. చమురు నౌకలో అగ్ని ప్రమాదం జరిగితే మంటల్ని అదుపులోకి తెచ్చి నౌక సిబ్బందిని, ఇతర ప్రయాణికుల్ని రక్షించేందుకు కోస్ట్ గార్డ్ చూపిన ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలకు మాక్ డ్రిల్ పతీకగా నిలిచింది.

సముద్రపు నీటిని అధిక పీడనంతో ప్రమాదం సంభవించిన నౌకపైకి వెదజల్లడం, సముద్రంలో పడిపోయిన వారిని స్పీడ్ బోట్లతో రక్షించడం, చేతక్ హెలీకాఫ్టర్​తో గజ ఈతగాళ్లను సముద్రంలోకి దింపడం, ప్రమాదం నుంచి రక్షించిన వారిని వైద్య నౌకలోకి చేర్చడం వండి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విపత్తు నిర్వహణలో కీలకమైన సన్నద్ధతను, శక్తిసామర్థ్యాలను పరీక్షించేందుకు ఇలాంటి ఎక్స్​ర్​సైజ్​లు నిర్వహిస్తున్నట్టు కోస్ట్ గార్డ్ కమాండెంట్ టీ.ఆర్.​కే రావు చెప్పారు. ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన సారెక్స్-2003 కాకినాడ కోస్ట్ గార్డ్ ​స్టేషన్​కు అప్పగించారని తెలిపారు. ఈ విన్యాసాల్లో ఐసీజీఎస్ సముద్ర వహెరదార్, ఐసీజీఎస్ విగ్రహ, ఐసీజీఎస్ కనకలత బారువా, ఐసీజీఎస్ ప్రియదర్శిని, చార్లీ 430, చార్లీ 438, చార్లీ 449 నౌకలు పాల్గొన్నాయి.

"ఇలాంటి కార్యక్రమాలు రీజినల్​ స్థాయిలో ఏర్పాటు చేస్తాము. ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, పుదుచ్చేరి ఈ మూడు రాష్ట్రాలకు కలిపి ఒక్కో సంవత్సరం ఒక్కో ప్రదేశంలో ఏర్పాటు చేస్తాము. ఈ సంవత్సరం ఇండియన్​ కోస్ట్​గార్డ్​ స్టేషన్​ కాకినాడ కేంద్రానికి ఈ బాధ్యతలు అప్పగించారు. సముద్రంలో ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవరికి తెలియదు. ప్రాక్టిస్​ లేకపోతే కమాండెంట్​లు ఒక గ్రిడ్​లోకి రాలేరు. వారికి ప్రాక్టీస్​ ఉండటానికి ఇలాంటి ఎక్స్​ర్​సైజ్​లు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తాము. మాకు ప్రతిచోట ఎమ్ఆర్సీసీ అని ఉంటుంది. దానివల్ల ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు రక్షించటానికి అవకాశం ఉంటుంది." - టీఆర్​కే రావు, ఎక్జ్​క్యూటివ్​ ఆఫీసర్​, ఐసీఎస్​, కాకినాడ

ఇవీ చదవండి:

Last Updated : Mar 30, 2023, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.