TDP Dalitha Girjana at Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో తెలుగుదేశం చేపట్టిన దళిత గర్జనను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, తెదేపా అధికార ప్రతినిధి వర్మను గృహనిర్బంధం చేశారు. శుక్రవారం రాత్రి కాకినాడలో వర్మను ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. అయితే.. వర్మ తప్పించుకొని అక్కడినుంచి పిఠాపురం తెదేపా కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో వర్మ బయటకు రాకుండా కార్యాలయాకి తాళం వేశారు. పోలీసులు తీరుపై తెదేపా నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. చివరకు తాళం తీసినప్పటికీ పార్టీ నాయకుల్ని మాత్రం పోలీసులు నిర్బంధంలోనే ఉంచారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ.. శాంతియుత ర్యాలీలను అడ్డుకోవడం దారుణమన్నారు.
పిఠాపురంలో దళిత గర్జనకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న నాయకులపైనా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. పిఠాపురం మండలం కుమారపురం వద్ద కాకినాడ మాజీ ఎమ్యెల్యే కొండబాబు, తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్. రాజును అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు.
ఇదీ చదవండి: