Rachabanda: భారీ మర్రి వృక్షం.. ఆ కింద విశాలమైన రచ్చబండ. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని కొంతంగి కొత్తూరులో వ్యవసాయ పనులు అయ్యాక.. ఖాళీ సమయాల్లో గ్రామస్థులు అక్కడికొచ్చి సేద తీరుతున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకొంటున్నారు. పక్షులు పాడు చేయకుండా, ఆకులు కిందపడకుండా రచ్చబండపై రేకుల షెడ్డు వేసి హంగులు దిద్దారు. దీంతో ఎండైనా, వానైనా అక్కడ విశ్రాంతి తీసుకునే వీలు దక్కింది. ఎండల్లో అటుగా రాకపోకలు సాగించేవారు సైతం కాసేపు ఆగి ఈ చెట్టు నీడన సేద తీరుతున్నారు.
ఇదీ చదవండి: