ETV Bharat / state

ఎంత బలంగా ఉన్నామో జగన్​లోని భయమే చెప్తోంది : పవన్​ - వైఎస్సార్​సీపీ

Pawan Tour in Kakinada: జనసేన అధినేత తన పర్యటనలో భాగంగా మూడో రోజు కాకినాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జనసేన ముఖ్య నాయకులతో పవన్‌ అంతర్గత సమావేశం నిర్వహించనున్నారు. వైఎస్సార్​సీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటమే తమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.

_pawan_tour_in_kakinada
_pawan_tour_in_kakinada
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2023, 12:41 PM IST

Pawan Tour in Kakinada: రాష్ట్రంలో రానున్న ఎన్నికల దృష్ట్యా రాజకీయ పార్టీలన్ని ఎన్నికలకు సమయత్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార వైఎస్సార్​సీపీ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జ్​లను మారుస్తోంది. అంతేకాకుండా పోటీలో దిగే అభ్యర్థుల స్థానాల్లో కూడా మార్పులు చేపట్టింది. తెలుగుదేశం - జనసేనల పొత్తు కూడా ఆ దిశగా పయనిస్తోంది. ఏ పార్టీ శ్రేణులను ఆ పార్టీ సిద్ధం చేసుకుంటోంది.​

జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిసిన పొత్తుతో బలంగా ఉన్నామనే భయం జగన్ మాటల్లో కనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడలో మూడోరోజూ పవన్‌ పర్యటించనున్నారు. జనసేన ముఖ్య నాయకులతో పవన్ సమావేశం కానున్నారు.

శుక్రవారం కాకినాడ నగర నియోజకవర్గ పరిధిలోని 20 డివిజన్లలోని పరిస్థితిపై ఆయన సమీక్షించారు. సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయా డివిజన్ల జనసేన అధ్యక్షులు, మహిళలు, తటస్థులతో పవన్ భేటీ అయ్యారు. తర్వాత నగరంలోని వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లు, వ్యాపారులు, కార్మిక సంఘాలు, ఇతర కీలక వర్గాలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు.

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌

వైఎస్సార్​సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అందరి లక్ష్యం కావాలని, ఆ వ్యూహానికి కాకినాడ నుంచే శ్రీకారం చుడదామని పవన్ పిలుపునిచ్చారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఒక్కసీటు కూడా వైసీపీకి దక్కకూడదని అందుకు తగ్గట్టుగా ప్రజల్లోకి వెళ్లి శ్రమించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

జనసేన బలం ఏమిటో రానున్న ఎన్నికల్లో చూపించాలన్నారు. టీడీపీతో పొత్తు రాజకీయ ప్రయాణంలో బలంగా ముందుకు వెళ్లడానికేనని వివరించారు. వైఎస్సార్​సీపీ వ్యతిరేక ఓటు ఒక్కటీ చీలకూడదని స్పష్టం చేశారు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసే పరిస్థితికి వైఎస్సార్​సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు లాంటివాళ్లు తెగించారని, ఆ విషయాన్ని ఎస్సీలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.

పార్టీ ముఖ్యనేతలతో జనసేనాని సమావేశం - ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక, పోటీ స్థానాలపై చర్చలు

ఎస్సీలే మా బలం అని వైఎస్సార్​సీపీ నేతలు అనుకుంటున్నారని జగన్ పాలనలో రద్దుచేసిన పథకాలు, ఎస్సీలకు చేసిన ద్రోహాన్ని అర్థమయ్యేలా ప్రజలకు వివరించాలని కోరారు. మహిళలకు రక్షణ లేదని సమావేశానికి హాజరైనవారు ఆయనకు వివరించారు. దీనిపై పవన్ స్పందిస్తూ తల్లినీ, చెల్లినీ గెంటేసినోడి పాలనలో రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

ఆడవారిని అవమానించడమే వారి నైజమని అన్నారు. కాకినాడ నగరంలోని డివిజన్ల వారీగా సమస్యలు, వైఎస్సార్​సీపీ నేతల అక్రమాలను పవన్ నోట్ చేసుకున్నారు. తెలుగుదేశం - జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ సరిచేస్తామని భరోసా ఇచ్చారు.

లోకేశ్​కు అభినందనలు, పవన్ కల్యాణ్​కి ధన్యవాదాలు : చంద్రబాబు నాయుడు ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.