Mock Drill on Natural Disasters: ప్రకృతి వైపరీత్యాలు, తుపానులు, వరదలు వచ్చినప్పుడు.. రక్షణ దళాలు ప్రజలను ఎలా కాపాడతారు అనే దానిపై.. కాకినాడ జిల్లాలోని అంతర్బాగం, కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని కాపాడి పునరావాసం కల్పించటంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. నీటిలో చిక్కుకున్నవారిని కాపాడే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఇళ్లు కూలి శిథిలాల కింద చిక్కుకున్నవారిని రెస్క్యూ చేసి ఆస్పత్రికి తరలించే విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా గోదావరి తీర ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ తుపాన్ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం తుపాను ప్రభావానికి నేలకొరిగిన చెట్లను తొలగించారు. మత్స్యకారుని రక్షించి ఆసుపత్రికి తరలించారు. వరద ప్రభావానికి నివాసాలు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించి ఆహారం అందించారు. పెనుగాలులకు ఇల్లు కూలి ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇలా వివిధ కార్యక్రమాలతో అవగాహన కల్పించారు.
పుదుచ్చేరి కలెక్టర్ ఆదేశాల మేరకు సుమారు రెండు గంటల పాటు మాక్ డ్రిల్ నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చదవండి: