"నేను గాంధీని కాను. నేను ఎవరి జోలికి వెళ్లను. నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం సమాధానం చాలా గట్టిగా ఉంటుంది" అని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా తునిలో వాలంటీర్ల అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఇటీవల తునిలో జరిగిన ఓ ఘటనపై స్పందించారు. చిన్న పిల్లలు కదా అని ఊరుకుంటుంటే.. వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఘటనపై అసలు విషయం తెలియకుండా జిల్లా నాయకులు ఏదోదో మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు.
'ఘటనకు సంబంధించి ఓ పార్టీ వారిపై తాను కేసులు పెట్టించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది తనకు సంబంధించిన విషయం కాదు. సామాజిక మాధ్యమాల వేదికగా ఇద్దరి మధ్య జరిగిన వివాదం పెరిగి.. కొట్లాటకు దారితీసింది. దానిపై పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. అంతకుముందు నేను ఇంట్లో నేని సమయంలో నా ఇంటిపైకి దాడికి వచ్చారు. అక్కడ ఉన్నవారు సర్ధిచెప్పి పంంపితే బయటికి వెళ్లి మళ్లీ గొడవపడ్డారు. పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్లను మా పార్టీ నాయకులే విడిపించారు.. నేను చేడు చేయాలనుకుంటే వారు బయటకొచ్చేవారా?' అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: 2023 జూన్ నాటికి.. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు: మంత్రి పెద్దిరెడ్డి