ETV Bharat / state

Kakinada Arudra Issue: న్యాయం కోసం వచ్చిన మహిళకు.. నరకం చూపిస్తున్నారు! - కాకినాడ మహిళ ఆరుద్ర

Kakinada Arudra Issue: కన్నబిడ్డ ఆరోగ్యం కోసమే ఆ తల్లి జీవన పోరాటం..! కదల్లేని కుమార్తెకు వైద్యం చేయించాలనే తాపత్రయం. అలాంటి అమ్మ ప్రేమపై.. మెంటల్‌ ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద.. గతంలో ఆత్మహత్యా యత్నం చేసిన కాకినాడ మహిళ ఆరుద్రను.. బలవంతంగా విశాఖ మానిసిక వైద్యాలయంలో చేర్చడం.. విస్తుగొలుపుతోంది. న్యాయం చేయాలని రోడ్డెక్కితే ప్రత్యక్ష నరకం చూపించారని రోదిస్తున్నారు ఆరుద్ర..!

Kakinada Arudra Issue
కాకినాడ మహిళ ఆరుద్ర సమస్య
author img

By

Published : Jun 15, 2023, 7:23 AM IST

Kakinada Arudra Issue: న్యాయం కోసం వచ్చిన మహిళకు.. నరకం చూపిస్తున్నారు!

Kakinada Arudra Issue: కరోనా సమయంలో.. మాస్కులివ్వండి మహాప్రభో అని గొంతెత్తారు నర్సీపట్నానికి చెందిన వైద్యుడు సుధాకర్‌.! ఆ తర్వాత అతనిపై.. పిచ్చోడని ముద్రవేశారు. మానసిక వైద్యశాలకు పంపారు. ఇప్పుడాయన మన మధ్యలేరు.

ఇక ఇప్పుడు కాకినాడ జిల్లా రాయుడుపాలేనికి చెందిన ఆరుద్ర! ఈమె కష్టం గురించి తెలియని వారు రాష్ట్రంలో.. ఎవరూ ఉండరేమో. కదల్లేని స్థితిలో ఉన్న కుమార్తె సాయిలక్ష్మీచంద్ర శస్త్రచికిత్స కోసం ఆమె మొక్కని గుడిలేదు..తిరగని ఆఫీస్‌లేదు. న్యాయం చేయాలంటూ చివరకు.. సీఎం కార్యాలయం వద్దే చెయ్యికోసుకుని.. ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. సుధాకర్‌ లాగే ఈమెపైనా.. మెంటల్‌ ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. కాకపోతే.. ఎలాగోలా బయటపడి ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.

Chandrababu on Arudra Issue: ఆరుద్రపై పిచ్చి ముద్ర వేయడం సైకో పాలనకు పరాకాష్ట.. చంద్రబాబు ట్వీట్​

అప్పుడు సుధాకర్‌కు జరిగిందే.. ఇప్పుడు ఆరుద్రకూ జరిగింది. ఆరుద్ర తపనంతా కదల్లేని తన కుమార్తె సాయిలక్ష్మీచంద్ర గురించే. అమ్మాయి శస్త్రచికిత్స కోసం సొంత ఇల్లూ అమ్ముదామని ప్రయత్నిచారు. కాకపోతే.. మంత్రి అండతో ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుపడుతున్నారంటూ ఆరుద్ర గతేడాది నవంబరు 2న సీఎం క్యాంపు కార్యాలయం వద్ద చెయ్యికోసుకున్నారు. ఆ తర్వాత సీఎంఓ అధికారులు ఆరుద్రకు.. అభయమిచ్చారు. అన్నిసమస్యలూ.. పరిష్కరిస్తామని, సాయిలక్ష్మీచంద్ర వైద్యానికీ.. సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇల్లు అమ్ముకోగలిగినా.. తమను వేధించిన వారిని వదిలేశారన్నది ఆరుద్ర ఆవేదన. మాటలతో మభ్యపెట్టారని గ్రహించిన ఆరుద్ర.. ఈ నెల 7న కాకినాడ కలెక్టరేట్‌ వద్ద కుమార్తెతో సహా నిరవధిక దీక్షకు దిగారు. అదే రోజు.. అర్ధరాత్రి దాటాక పోలీసులు దీక్షను భగ్నం చేశారు. తల్లీ కుమార్తెలను తొలుత కాకినాడ జీజీహెచ్​కి.. ఆ తర్వాత విశాఖలోని మానసిక వైద్యశాలకు బలవంతంగా.. తరలించారు. చికిత్స పేరుతో మెంటల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారని ఆరుద్ర రోదిస్తున్నారు. ప్రస్తుతం.. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.

"నన్ను, నా బిడ్డను తీసుకెళ్లి.. కాకినాడ జీజీహెచ్​లోని పైన రూమ్​లో పడేశారు. మా దగ్గర నుంచి ఫోన్లు లాగేసుకున్నారు. ఎవరినీ కలవనివ్వలేదు. అస్సలు మేము ఎక్కడ ఉన్నామో తెలియకుండా చేశారు". - ఆరుద్ర, బాధితురాలు

arudra case : అయ్యో.. ఆరుద్ర!.. జీజీహెచ్ నుంచి మానసిక వైద్యశాలకు తరలింపు

ఆరుద్రను.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత పరామర్శించారు. ఆడబిడ్డ న్యాయం కోసం రోడ్కెక్కితే పిచ్చిదనే ముద్రవేసారా అని ఆక్రోశించారు. గతేడాది నవంబరు 2న సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మొదలైన ఆరుద్ర ఆక్రందన చల్లారలేదు. ఆమె కన్నీటిధారలూ ఆగలేదు. న్యాయం చేయకపోయినా పర్వాలేదుగానీ.. పిచ్చిదనే ముద్రవేసి అన్యాయం చేయకండని ఆరుద్రఅర్థిస్తోంది.

"గత ఏడాది నవంబర్​లో కోటి రూపాయలు వైద్యం కోసం ఇస్తామాన్న సీఎం జగన్.. ఈ రోజు ఏమో ఆ తల్లీ కుమార్తెలపై పిచ్చి వాళ్లు అనే ముద్ర వేయాలని చూస్తున్నారు. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి.. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు పిచ్చివాడు అనే ముద్ర వేశారు. ఈ రోజు అతనిని మన మధ్యన కూడా లేకుండా చేశారు. వీటిని చూస్తుంటే సీఎం జగన్ ఎంత సైకోలా ప్రవర్తిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు". - అనిత, తెలుగుమహిళ అధ్యక్షురాలు

Arudra Protest: పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ.. దివ్యాంగురాలైన కుమార్తెతో తల్లి నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.