ETV Bharat / state

గొంతుకోసి.. ఆలిని పాతిపెట్టి.. - Kakinada Murder

Woman Murder: జీవితాంతం తోడుంటాడు అనుకున్న ఆ యువతికి భర్తే కాలయముడయ్యాడు. పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే ఆ యువతికి భర్తతో గొడవలు ప్రారంభమయ్యాయి. వారిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా ఆ యువతిని భర్తే గొంతుకోసి హతమార్చడు.

Woman Murder
భర్యాను గొంతుకోసి హతమార్చిన భర్త
author img

By

Published : Sep 2, 2022, 10:45 AM IST

Woman Murder: మూడేళ్లుగా భర్తతో గొడవలు. ఇద్దరు పిల్లలు పుట్టినా అతనిలో మార్పులేదు. దీంతో పుట్టింట్లో ఉంటూ పిల్లలను పోషించుకుంటున్న ఆమెపై భర్త కత్తిగట్టాడు. నమ్మించి గొంతుకోసి చంపేశాడు.. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పాతిపెట్టి భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంధువుల సాయంతో ఈ ఘటనను పోలీసులు వెంటనే ఛేదించారు. పెద్దాపురం పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..

రంగంపేట మండలం మర్రిపూడికి చెందిన పాపారావుకు పెద్దాపురం మండలం కాండ్రకోటకు చెందిన లింగం బున్ని(24)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మూడేళ్లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో అతనికి దూరంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ కొన్ని రోజుల క్రితం నుంచి కలిసి ఉంటున్నారు. లింగం బున్ని పెద్దాపురం పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ పుట్టింట్లో ఉంటోంది. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ఆటోలో వెళ్లడానికి సిద్ధమవుతుండగా పాపారావు ఆమె వద్దకు వెళ్లి కాండ్రకోట తీసుకెళ్తానని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. సిరివాడ నుంచి వులిమేశ్వరం వెళ్లే దారిలో ద్విచక్ర వాహనాన్ని ఆపి తన వద్ద ఉన్న కత్తితో బున్ని గొంతుకోసి చంపేశాడు. సమీపంలోని పంట పొలాల్లో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టాడు. ఏమీ తెలియనట్లు రంగంపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భార్య కనిపించడంలేదంటూ ఫిర్యాదు చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు బున్ని బంధువులకు ఫోన్‌చేసి చెప్పారు. పంట పొలాల్లో ఆమె మృతదేహం గుర్తించిన బంధువులు రంగంపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భర్త పాపారావును అదుపులోకి తీసుకున్నారు. పాపారావు దంపతులకు నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల వయసు గల కుమార్తె ఉన్నారు. ఈనెల 4న కుమార్తె పుట్టినరోజు వేడుకలు చేయాల్సి ఉంది. ఈలోగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దాపురం పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.