ETV Bharat / state

'ఆల్ ఇండియా కపుల్ టూర్' పేరుతో సైకిల్​పై దంపతుల భారత్​ యాత్ర

Couple All India Tour: ఇటీవల కాలంలో డబ్బు.. ఆస్తులు సంపాదన మీద కన్నా మానసిక ఆనందం.. దేశలోని భిన్న సంస్కృతి సంప్రదాయాలు.. వివిధ రాష్ట్రాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉంటున్నాయనేది తెలుసుకోవాలనే ఆకాంక్ష ఎక్కువమందిలో కలుగుతోంది. లక్షల రూపాయలు జీతాలు పొందే సాఫ్ట్​వేర్​ ఉద్యోగాలు.. కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వహించే వ్యాపారవేత్తలు ఈ కోవలో ఉన్నారు. కొందరు ద్విచక్ర వాహనాల పైన.. మరికొందరు ఖరీదైన కారులోనూ యాత్ర సాగిస్తూ ఉంటారు. పర్యావరణానికి ఏ విధమైన హాని కలగకుండా పశ్చిమ బెంగాల్​కు చెందిన భార్యాభర్తలు భారతదేశమంతా చుట్టు తిరిగి రావాలని ఆకాంక్షతో సైకిల్​పై తమ ప్రయాణాన్నిప్రారంభించి రాష్ట్రాలు దాటుకుంటూ కేంద్రపాలిత ప్రాంతమైన యానాం చేరుకున్నారు.. వివరాల్లోకి వెళితే..

cycle tour
cycle tour
author img

By

Published : Jan 29, 2023, 10:12 PM IST

All India Couple Tour : ఆల్ ఇండియా కపుల్ టూర్ పేరుతో పశ్చిమ బెంగాల్​లో ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే ప్రదీప్ దేవనాద్.. అతని భార్య సంగీత దేవనాద్​లు గత ఏడాది అక్టోబర్ 27వ తేదీన బెంగాల్ నుండి భారతదేశ యాత్రకు సాధారణ సైకిల్​పై బయలుదేరారు.. ఇన్ని రోజుల్లో దేశం చుట్టూ తిరిగే రావాలనే సమయం నిర్దేశించుకోకుండా ఆయా రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు.. ఆ ప్రాంతాల్లో ఉండే పర్యాటక మరియు.. ప్రముఖ దేవాలయాలు సందర్శిస్తూ.. స్థానిక ప్రజలతో మమేకమై భాష.. ఆచార వ్యవహారాలు. సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకుంటున్నారు.. ఆ వివరాలను తమ సెల్​ఫోన్లలో చిత్రీకరించి ఎప్పటికప్పుడు యూట్యూబ్​లో అప్​లోడ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన ప్రముఖ పర్యట ప్రాంతమైన యానాంలో ఈ జంట సైకిల్​పై షికారు చేయడం స్థానికులను ఆకర్షించింది.. శివమ్ బాత్.. భరతమాత విగ్రహాల వద్ద భార్యాభర్తలు సెల్ఫీలు దిగుతూ గౌతమి గోదావరి నది అందాలను వీక్షించారు.

సైకిల్​పై దంపతుల భారత్​ యాత్ర

గత ఏడాది అక్టోబర్ 27వ తేదీ భార్యతో కలసి సైకిల్ యాత్ర ప్రారంభించామని.. ప్రతిరోజు మేముండే ప్రాంతాల్లో విశిష్టతలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం.. స్థానికులు ఇచ్చే సలహాలు స్వీకరిస్తూ ఆలయాలు.. పర్యాటక సెంటర్లలో బస చేస్తూ మా ప్రయాణం సాగిస్తున్నాం.. చిన్న ప్రాంతమైనా యానాం అభివృద్ధిలోనూ పర్యటకంగానూ ఆకర్షణీయంగా ఉంది. తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని లేకుండా ఉండాలనే సైకిల్ ఎంచుకున్నాం. -ప్రదీప్ దేవనాద్, సంగీత దేవనాద్

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.