ETV Bharat / state

'ఎస్ఐ మృతిపై అసత్య ప్రచారం చేస్తే.. కఠిన చర్యలు తప్పవు'

కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ మృతిపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని... ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు హెచ్చరించారు. సున్నిత మనస్కుడు కావడం వల్లే గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. నిజాలు తెలిసి కూడా పోలీస్ శాఖ ప్రతిష్ట దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు

ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు
ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు
author img

By

Published : May 15, 2022, 4:35 PM IST

కాకినాడజిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ మృతిపై రాజకీయాలు.. అసత్య ప్రచారాలు కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు హెచ్చరించారు. సున్నిత మనస్కుడు కావడం వల్లే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడని.. గోపాలకృష్ణ ఆత్మహత్యపై వస్తున్న ఆరోపణలు అసత్యాలని స్పష్టం చేశారు.

'ఎస్ఐ మృతిపై అసత్య ప్రచారం చేస్తే.. కఠిన చర్యలు తప్పవు'

తప్పుడు ప్రచారంతో పోలీస్ శాఖ ప్రతిష్ట దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని పాలరాజు తెలిపారు. పోస్టింగ్ విషయంలో ఎస్ఐ గోపాలకృష్ణకు ఎటువంటి అన్యాయం జరగలేదన్నారు.తన చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని స్నేహితులతో కుటుంబ సభ్యులతో గతంలోనే పేర్కొన్నాడని.. సూసైడ్ నోట్ లోనూ అదే రాశారని డీఐజీ తెలియజేశారు.

ఇదీ జరిగింది: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన గోపాలకృష్ణ 2014లో ఎస్‌.ఐ.గా ఎంపికై ఉమ్మడి తూర్పుగోదావరిలో పని చేశారు. 2021 ఆగస్టు నుంచి కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్​ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబంతో కలిసి నాగమల్లితోట జంక్షన్‌లో నివాసముంటున్నారు. గురువారం సీఎం బందోబస్త్‌కు వెళ్లి వచ్చి నిద్రపోయారు. భార్య, ఇద్దరు పిల్లలు ఓ గదిలో నిద్రిస్తుండగా తెల్లవారుజామున 5 గంటల సమయంలో హాల్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఒత్తిడే ఆత్మహత్యకు కారణంగా కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. కానీ పోలీసు అధికారులు మాత్రం గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యిందని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.