కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వరద నష్టాన్ని డీఎంకే శాసనసభ్యులు బృందం పరిశీలించింది. పార్టీ అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాలతో పుదుచ్చేరి అసెంబ్లీలో పార్టీ సీనియర్ నేత శివ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం పలు ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులకు 15 రోజులుగా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వరద ముంపు ప్రాంతాలను ట్రాక్టర్ పై వెళ్లి పరిశీలించారు. యానాం డిప్యూటీ కలెక్టర్ అమన్ శర్మతో సమావేశమై సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. రక్షణ గోడను తక్షణం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కలెక్టర్‌ను డీఎంకే ఎమ్మెల్యేల బృందం కోరింది.
ఇవీ చూడండి