ETV Bharat / state

బెంగళూరులో ఆంధ్ర యువతి హత్య.. పెళ్లికి అంగీకరించలేదని 16 సార్లు కత్తితో పొడిచి - పెళ్లికి నిరాకరించినందుకు హత్య

Bengaluru Knife Attack: కర్ణాటక రాష్ట్ర రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. తనతో పెళ్లికి నిరాకరించిందనే కారణంతో యువతిపై కత్తితో దాడి చేశాడో దుండగుడు. తనను దూరం పెడుతూ పెళ్లికి నిరాకరిస్తోందని.. మనస్థాపానికి గురైన ప్రియుడు ఈ దారుణానికి ఒడి గట్టాడు. అసలేం జరిగిందంటే..

murder
murder
author img

By

Published : Mar 1, 2023, 2:46 PM IST

Updated : Mar 1, 2023, 5:09 PM IST

Young Man Murdered His Lover : ప్రేమను అంగీకరించలేదని ఒకరు. ప్రేమించమని మరొకరు. పెళ్లికి ఒప్పుకోలేదని ఇంకొకరు. ఇలా రోజూ ఏదో ఒక చోట యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రేమించిన యువతి దూరం పెడుతూ.. పెళ్లికి నిరాకరించిందని కర్ణాటకలో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఒకటి కాదు రెండు కాదు 16 సార్లు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు.

ఆంధ్రప్రదేశ్​కు చెందిన లీలా పవిత్ర అనే యువతి బెంగుళూరులో దారుణ హత్యకు గురైంది. తనతో పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఆమె ప్రియుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. 16 సార్లు కత్తితో పొడిచి తన కీచకత్వాన్ని ప్రదర్శించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లాకు చెందిన లీలా పవిత్ర బెంగుళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరింది. అదే సంస్థలో ఆమెతో పని చేస్తున్న దినకర్​ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది.

వీరి మధ్య ఉన్న ప్రేమను లీలా తన తల్లిదండ్రుల ముందుంచింది. దీనికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇదే విషయాన్ని ఆమె దినకర్​కు తెలియజేసింది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటంతో ఆమె ప్రియుడ్ని దూరం పెడుతూ వచ్చింది. ఇది దినకర్​కు నచ్చలేదు. లీలా పవిత్రకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. మరో యువకుడితో లీలా పవిత్రకు వివాహం నిశ్చయమవటం.. ఆమె తనను దూరం పెట్టడం దినకర్​ జీర్ణించుకోలేక పోయాడు. పట్టరాని కసితో దారుణానికి ఒడిగట్టాడు. మంగళవారం అమె పని చేస్తున్న సంస్థ వద్దకు కలవటానికి వచ్చాడు. ఆమె విముఖత చూపింది. దీంతో ఆమె ఉద్యోగానికి వెళ్లి.. విధులు ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో.. పని చేసే సంస్థ కార్యాలయం ఎదుటే, అతని వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. 16 సార్లు కత్తితో పొడవటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె తోటి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దినకర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన లీలా పవిత్రను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె సహచరులు మృతురాలి తల్లిదండ్రులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్నవారు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Mar 1, 2023, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.